MI vs RR IPL 2022: వరుసగా 8 ఓటముల తర్వాత ముంబయి మరో దండయాత్ర.. రాజస్థాన్ తో నేడు మ్యాచ్?

MI vs RR IPL 2022: ఐపీఎల్ లో నేడు జరగనున్న రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్స్ కు చేరువ అవ్వాలని రాజస్థాన్ యోచిస్తుండగా.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని ముంబయి జట్టు తహతహలాడుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 01:46 PM IST
MI vs RR IPL 2022: వరుసగా 8 ఓటముల తర్వాత ముంబయి మరో దండయాత్ర.. రాజస్థాన్ తో నేడు మ్యాచ్?

MI vs RR IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. శనివారం జరగనున్న రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ కు మరో రెండు అడుగుల దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. ముంబయితో ఆడనుంది. అయితే ఇప్పటికే టోర్నీలో వరుసగా 8 మ్యాచ్ లను ఓడిన రోహిత్ సేన.. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరాలని రాజస్థాన్ సన్నద్ధమవుతుండగా.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేయాలనే సంకల్పంతో ముంబయి జట్టు సిద్ధమవుతుంది. 

రాజస్థాన్ బలాబలాలు

రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఆ మ్యాచ్ లో 144 స్కోరును ప్రత్యర్థికి నిర్దేశించింది. అయితే ఈ తక్కువ లక్ష్యాన్ని కూడా ఆర్సీబీ ఛేధించకుండా రాజస్థాన్ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. మరోవైపు జోస్ బట్లర్, దేవ్ దత్ పడిక్కల్, సంజూ శాంసన్ తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అటు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ ధృఢంగా ఉన్న రాజస్థాన్ ను అడ్డుకోవడం ముంబయి టీమ్ కు పెద్ద సవాలు గా మారే అవకాశం ఉంది. 

తొలి విజయం కోసం పోరాటం..

మరోవైపు ముంబయి ఇండియన్స్ కూడా తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని తహతహలాడుతుంది. బ్యాడ్ ఫేజ్ లో ఉన్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.. జట్టు కోసం పరుగులు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

15 కోట్ల 25 లక్షల రూపాయాలకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో 199 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రీవిస్ అప్పుడప్పుడు ఆడుతున్నా.. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు బౌలింగ్ లోనూ జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్ విఫలమయ్యారు.

తుదిజట్లు (అంచనా)..

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), డారెల్ మిచెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, పి.కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్. 

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా.  

Also Read: IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ అద్భుత విజయం

Also Read: Virat kohli, T20 World CUP: వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఆడేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News