Shoaib Akhtar On Virat Kohli Form: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పరుగుల ప్రవాహం సృష్టిస్తూ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరుపై లికించుకున్నాడు. మంచినీరు త్రాగినంత సులభంగా సెంచరీలు చేసే కోహ్లీ.. ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100), ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (71) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు.
గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేడు. గత దశాబ్దంలో సెంచరీల మోత మోగించి, 20 వేలకు పైగా పరుగులు చేసి ఐసీసీ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్ అవార్డు గెలిచిన కోహ్లీ.. ఇప్పుడు ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. పరుగులు చేస్తున్నా.. భారీ స్కోర్లు మాత్రం చేయడం లేదు. విరాట్ సెంచరీ (Virat Kohli Century) చేసి రెండేళ్లు దాటింది. పరుగులు చేయని ప్రతిసారి అతని సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)ను నెటిజన్లు ట్రోల్ చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కూడా వారికి జతకలిశాడు. అనుష్కను వివాహం చేసుకొవడం వల్లనే.. కోహ్లీ ఇలా ఇబ్బందిపడుతున్నాడు అని పరోక్షంగా అన్నాడు.
'విరాట్ కోహ్లీకి ఇప్పుడు టైం బాగోలేదు. అతను ఇప్పుడు మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను విరాట్ స్థానంలో ఉంటే.. ఇప్పటికీ పెళ్లి చేసుకునేవాడిని కాదు. కేవలం పరుగులు చేస్తూ క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. బ్యాటర్‌గా ఈ 10-12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగి రాదు. నేను పెళ్లి చేసుకోవడం తప్పు అని చెప్పడం లేదు కానీ భారత జట్టుకి ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయంలో క్రికెట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. కోహ్లీ అంటే అభిమానులకు పిచ్చి. అతను గత 20 సంవత్సరాలుగా పొందుతున్న ప్రేమను కొనసాగించాల్సి ఉంటుంది' అని షోయబ్ అక్తర్ ఓ జాతీయ మీడియాతో అన్నాడు.
'పెళ్లి, పిల్లలు, కెప్టెన్సీల కారణంగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. అప్పుడు క్రికెట్‌పై పూర్తిస్థాయి దృష్టిని పెట్టేలేం. కోహ్లీ ఫామ్‌ను అందుకోకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నా... పెళ్లయ్యాక విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగులు చేయలేదనే నా ఉద్దేశం. క్రికెట్ కెరీర్ (14-15 సంవత్సరాలు) చాలా చిన్నది. అందులో 5-6 సంవత్సరాలు చాలా కీలకం. ఆ దశ విరాట్ దాటేశాడు. ఇప్పుడు విరాట్ కష్టపడాల్సి వచ్చింది' అని అక్తర్ పేర్కొన్నాడు.
'పనితీరు ఒత్తిడి విరాట్ కోహ్లీపై ఉంది. నేను 120 సెంచరీలు చేసిన తర్వాత కోహ్లీ వివాహం చేసుకోవాలనుకున్నాను. విరాట్ స్థానంలో నేను ఉంటే పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. ఏదేమైనా అది అతని వ్యక్తిగత నిర్ణయం' అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. విరాట్ తొందరపడి పెళ్లిచేసుకున్నాడని అక్తర్ అంటున్నాడు. అనుష్కను వివాహం చేసుకొవడం వల్లనే కోహ్లీ ఫామ్ కోల్పోయాడని అతడు చెప్పకనే చెప్పాడు.
Also Read: Good Luck Sakhi Trailer: అబద్దాలు ఆడేదానిలా కనిపిస్తుండానా.. నన్ను పెళ్లిసేసుకుంటావా: కీర్తి సురేశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి