LSG Vs PBKS Dream11 Team Prediction Today: ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తుంటే.. బౌలర్లు భయపెట్టే బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. లక్నోకు రెండో మ్యాచ్. లక్నో తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అటు పంజాబ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధఙంచి.. రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. లక్నో హోమ్ గ్రౌండ్ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్11, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్ రిపోర్ట్..
లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అయితే ఇటీవల మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ కూడా చెలరేగుతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ సమయానికి మంచు కురిసే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల ట్రాక్ రికార్డు బాగుంది. మొత్త వికెట్లలో 65 శాతం స్పిన్నర్లకే దక్కాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండు జట్లు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. రెండింటిలో లక్నో, ఒక మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది.
తుది జట్లు (అంచనా)..
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), డికాక్, దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ఠాకూర్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబడా, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.
LSG Vs PBKS Dream11 Team
వికెట్ కీపర్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, జితేశ్ శర్మ
బ్యాట్స్‌మెన్: శిఖర్ ధావన్, దీపక్ హుడా
ఆల్‌రౌండర్లు: స్టోయినిస్, సామ్ కర్రాన్, లివింగ్ స్టోన్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: హర్‌ప్రీత్ బ్రార్, రబడా, మొహ్సిన్ ఖాన్
Also Read: Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!
Also Read: Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook