KL Rahul And Athiya Wedding Gifts: కొత్తజంట రాహుల్‌-అతియాపై గిఫ్ట్‌ల వర్షం.. రూ.50 కోట్ల ఫ్లాట్‌, రూ.1.64 కోట్ల కారు! ఇంకా మరెన్నో

List of expensive gifts Athiya Shetty and KL Rahul received at Marriage. కేఎల్‌ రాహుల్, అతియా శెట్టి పెళ్లికి వచ్చిన బహుమతులపై సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినీ, క్రీడా రంగంలోని ప్రముఖులు నూతన జంటకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారట.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 25, 2023, 06:58 PM IST
  • కొత్తజంట రాహుల్‌-అతియాపై గిఫ్ట్‌ల వర్షం
  • రూ.50 కోట్ల ఫ్లాట్‌, రూ.1.64 కోట్ల కారు
  • ఇంకా మరెన్నో గిఫ్ట్‌లు
KL Rahul And Athiya Wedding Gifts: కొత్తజంట రాహుల్‌-అతియాపై గిఫ్ట్‌ల వర్షం.. రూ.50 కోట్ల ఫ్లాట్‌, రూ.1.64 కోట్ల కారు! ఇంకా మరెన్నో

Athiya Shetty, KL Rahul receive Rs 50 crore apartment: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి సోమవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ముంబైకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ ఖండాల‌లోని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కొద్దిమంది సన్నిహితుల స‌మ‌క్ష‌లంలో రాహుల్-అతియా పెళ్లి అంగరంగ వైభవంగా జ‌రిగింది. 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ.. ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు. రెండు రోజులుగా పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖులు, నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కేఎల్‌ రాహుల్, అతియా శెట్టి పెళ్లికి వచ్చిన బహుమతులపై (KL Rahul And Athiya Wedding Gifts) సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినీ, క్రీడా రంగంలోని ప్రముఖులు నూతన జంటకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారట. సునీల్‌ శెట్టి తన కుమార్తె అతియా శెట్టికి పెళ్లి బహుమతిగా ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాటును ఇచ్చారట. దీని విలువ దాదాపుగా రూ. 50 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. సునీల్‌ శెట్టి క్లోజ్‌ ఫ్రెండ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌.. కొత్త జంటకు రూ. 1.64 కోట్లు విలువ చేసే ఆడీ కారును గిఫ్ట్‌ ఇచ్చారని సమాచారం తెలుస్తోంది. 

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్.. కొత్త పెళ్లి కూతురు అతియా శెట్టికి రూ. 30 లక్షలు విలువ చేసే వాచ్‌ని బహుమతిగా ఇచ్చారట. బాలీవుడ్ యువ హీరో అర్జున్‌ కపూర్‌ డైమండ్‌ హారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. రాహుల్‌-అతియాకు బీఎమ్‌డబ్ల్యూ కారు  గిఫ్ట్‌ ఇచ్చారడట. మరోవైపు టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక బైక్‌ను గిఫ్ట్‌ ఇచ్చారని సమాచారం. ఇవే కాకుండా కొత్తజంట రాహుల్‌-అతియాకు మరెన్నో గిఫ్ట్‌లు వచ్చాయట. 

Also Read: Affordable Electric Cars: చౌకైన ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిమీల ప్రయాణం! సూపర్ లుకింగ్   

Also Read: Women's IPL: మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే.. బీసీసీఐకి రూ. 4670 కోట్లు! పురుషుల ఐపీఎల్ కంటే ఎక్కువ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News