KKR vs RCB match: ఇరగదీసిన బెంగళూరు బౌలర్స్.. 84 పరుగులే చేసి చిత్తుగా ఓడిన కోల్‌కతా

Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలోనే విజయం సాధించింది.

Last Updated : Oct 21, 2020, 11:34 PM IST
KKR vs RCB match: ఇరగదీసిన బెంగళూరు బౌలర్స్.. 84 పరుగులే చేసి చిత్తుగా ఓడిన కోల్‌కతా

Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. ఐపిఎల్ 2020లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు అన్నీ ఒక ఎత్తు... ఇవాళ జరిగిన మ్యాచ్ ఒకెత్తు అనేలా సాగిన ఈ వన్ సైడెడ్ గేమ్‌కి అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది. Also read : KL Rahul: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరిచిపోయాడు.. Video వైరల్

85 పరుగుల అతి స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓపెనర్ దేవ్ దత్ పడిక్కల్ ( Devdutt Padikkal 25 పరుగులు; 17 బంతుల్లో 3 ఫోర్లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ( Aaron Finch 16 పరుగులు; 21 బంతుల్లో 2 ఫోర్లు) చేయగా గుర్కిరత్ సింగ్ ( 21 పరుగులు; 26 బంతుల్లో 4 ఫోర్స్ ), విరాట్ కోహ్లీ ( Virat kohli 18 పరుగులు; 17 బంతుల్లో 2 ఫోర్స్)లతో బెంగుళూరును సునాయసంగానే గెలిపించారు. Also read : Dwayne Bravo: ఐపీఎల్ 2020 నుంచి డ్వేన్ బ్రావో ఔట్

బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) చెలరేగిపోయాడు. తాను వేసిన 4 ఓవర్లలో 2 ఓవర్లు మెయిడిన్ చేసిన సిరాజ్.. మిగతా మరో 2 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) సైతం 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నవదీప్ శైని, వాషింగ్టన్ సుందర్‌ చెరో వికెట్ పడగొట్టారు. Also read : Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News