DC vs KXIP match highlights: ఢిల్లీపై సత్తా చాటిన పంజాబ్.. ధావన్ సెంచరీ వృథా

Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్:‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్‌ 2020లో ప్లేఆఫ్స్‌‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.

Last Updated : Oct 21, 2020, 01:35 AM IST
DC vs KXIP match highlights: ఢిల్లీపై సత్తా చాటిన పంజాబ్.. ధావన్ సెంచరీ వృథా

Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్:‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్‌ 2020లో ప్లేఆఫ్స్‌‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది. కేవలం 2 పాయింట్స్ తేడాతో 4వ స్థానంలో ఉన్న కోల్‌కతా ( Kolkata Knight Riders ) కంటే ఒక స్థానం వెనకబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందుంచిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్‌ మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ఆ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ( Shikhar Dhawan ) చేసిన సెంచరీ వృథా అయింది. ఈ ఓటమి తర్వాత కూడా 14 పాయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ పట్టికలో అగ్రభాగాన కొనసాగుతోంది. Also read : Shikhar Dhawan: చరిత్ర సష్టించిన శిఖర్ ధావన్

లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మేన్‌లో ( Kings XI Punjab ) ఓపెనర్లు కేఎల్ రాహుల్ (15), మయంక్ అగర్వాల్ (5) పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ.. ఆ ఇద్దరి తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్‌ గేల్‌ ( Chris Gayle 29 పరుగులు: 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నిఖోలస్ పూరన్‌ ( Nicholas Pooran 53 పరుగులు: 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ( Glen Maxwell 32 పరుగులు: 24 బంతుల్లో 3 ఫోర్లు) జట్టు విజయానికి బాటలు వేశాడు. కేఎల్ దీపక్ హుడా (15), జేమ్స్ నీశం (10) పరుగులు చేశారు. క్రిస్ గేల్, నిఖోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్ రాణించడంతో పంజాబ్‌‌ సునాయసంగానే విజయం సాధించింది. Also read : Riana Lalwani details: క్రికెట్ ప్రియులను షేక్ చేసిన ఈ రియానా లల్వాని ఎవరు ?

ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి దారితీసిన కారణాల్లో తుషార్‌ దేశ్‌పాండే ( Thushar Deshpandey ) బౌలింగ్ కూడా ఒకటైంది. తుషార్ వేసింది 2 ఓవర్లే కానీ అందులోనే 41 పరుగులు సమర్పించుకున్నాడు. దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో క్రిస్ గేల్‌ ఒక్కడే ఏకంగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌ను సెట్ చేసేశాడు. ఆ తర్వాత తుషార్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నికోలస్ పూరన్‌ వరుసగా సిక్స్‌, రెండు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టాడు. 

ఢిల్లీ బౌలర్లలో మళ్లీ రబాడా ( Kagiso Rabada ) రాణించాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన రబాడా.. పంజాబ్ బ్యాట్స్‌మేన్‌లో ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్, మ్యాక్స్‌వేల్‌లను పెవిలియన్ బాటపట్టించాడు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ చెరో వికెట్ తీశారు. Also read : Pravin Dubey in Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి కొత్త ఆటగాడు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 7 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ‌(106 నాటౌట్‌ : 61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ (14), రిషబ్‌ పంత్‌ (14), హెట్మెయిర్ (10), మార్కస్ స్టొయినిస్ (9) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా.. గ్లెన్ మాక్స్‌వెల్‌, నీశమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మొత్తానికి గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన సత్తా చాటుకుంది. Also read : HBD Virender Sehwag: అప్పట్లో ఒకడుండేవాడు, టెస్టు, టీ20లోనూ వీరబాదుడు బాదేవాడు

Trending News