Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?

MI Vs LSG IPL 2023 Match Highlights: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరో బూమ్రాను పట్టేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు హైదరాబాద్‌పై, ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ మధ్వాల్‌ ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? వేలంలో ముంబై ఎంతకు కొనుగోలు చేసింది..?     

Written by - Ashok Krindinti | Last Updated : May 25, 2023, 09:01 AM IST
Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?

MI Vs LSG IPL 2023 Match Highlights: ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతం చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన క్వాలిఫైయర్-2 పోరుకు అర్హత సాధించింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నోపై ముంబై 81 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 రన్స్‌కే కుప్పకూలింది.  ఈ నెల 26న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. 

ముంబై విజయంలో కీరోల్ ప్లే చేశాడు యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్. కేవలం ఐదు పరుగులకే 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్‌ గణంకాలతో రికార్డు క్రియేట్ చేశాడు. బూమ్రా, ఆర్చర్ వంటి స్టార్ బౌలర్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ పేస్ బాధ్యతలను భూజనా వేసుకున్నాడు. కీలక మ్యాచ్‌లో సత్తా చాటి ముంబైను గెలిపించిన ఆకాశ్ మధ్వాల్ ఎవరని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా సర్చ్ చేస్తున్నారు. ఆకాశ్ మధ్వాల్ 1993 నవంబర్ 23వ తేదీన ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆకాశ్ మధ్వాల్.. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ పొరుగింట్లోనే నివసిస్తున్నాడు. ఇద్దరు కూడా అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ తీసుకోవడం విశేషం. 

24 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఆకాశ్ మధ్వాల్ కేవలం టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. అయితే ఆకాశ్‌లోని టాలెంట్‌ను గుర్తించింది మాత్రం టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ నెలలోనే తన తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. 2022-23 దేశవాళీ సీజన్‌లో తమ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.

ఆకాశ్ మధ్వాల్‌ను 2021లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు వేలంలో కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఆడే అవకాశం రాలేదు. 2022 సీజన్‌కు అన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో.. సూర్యకు రీప్లేస్‌మెంట్‌గా ముంబై జట్టులో చేరాడు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో ఆకాశ్‌ మధ్వాల్‌ను రూ.20 లక్షలకే ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. స్టార్ పేసర్ బుమ్రా టోర్నీకి ముందే తప్పుకోగా.. ఆర్చర్ కొన్ని మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తరువాత గాయం కారణంగా ఆర్చర్ కూడా దూరమయ్యాడు. దీంతో ముంబై పేస్ విభాగం పూర్తిగా తేలిపోయింది.

ఈ సమయంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆకాశ్ మధ్వాల్.. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఓడిసిపట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడొట్టాడు. ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఎస్‌ఆర్‌హెచ్‌పై తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లోనూ ఆకాశ్ సత్తా చాటాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న హైదరాబాద్‌ జోరుకు కళ్లెం వేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి.. హైదరాబాద్‌ జట్టును 200 పరుగులకే కట్టడి చేయడంలో కీరోల్ ప్లే చేశాడు. బుధవారం కీలక మ్యాచ్‌లోనూ లక్నోపై ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించి టీమిండియాలో ఎంట్రీకి గ్రీన్ కార్డు సంపాదించాడు. త్వరలోనే ఆకాశ్ మధ్వాల్‌ను టీమిండియా జెర్సీలో చూసే అవకాశం ఉంది.

Also Read: Ray Stevenson Death News: RRR మూవీ సీనియర్ నటుడు హ‌ఠాన్మ‌ర‌ణం.. కారణం ఇదే..!  

Also Read: Highest Currency Note: ఇండియాలో రూ. 5 వేలు, రూ. 10,000 నోట్లు కూడా ఉండేవి తెలుసా ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News