Lucknow Super Giants Vs Chennai Super Kings Playing 11: లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 45వ మ్యాచ్ ఇది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో పటిష్ట స్థితిలో ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు లక్నోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో కృనాల్ పాండ్యా నేతృత్వంలో లక్నో బరిలోకి దిగనుంది.
మొహలీలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకోవడంతో దీపక్ చాహర్ చెన్నై జట్టులోకి వచ్చాడు.
'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ కవర్ కింద ఉంది. అది కొంచెం తడిగా కనిపిస్తోంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. దీపక్ చాహర్ ఫిట్‌గా ఉండడంతో జట్టులోకి వచ్చాడు. ఆకాష్ సింగ్‌కు రెస్ట్ ఇచ్చాం. మిగతా జట్టు కూడా అలాగే ఉంది..' అని ధోని తెలిపాడు. మీరు ఇది నా చివరి ఐపీఎల్ అని అనుకుంటున్నారని.. తాను కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు కెప్టెన్ కూల్. 'మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు కూడా అదే జరిగింది. కేఎల్ రాహుల్ దూరమవ్వడం పెద్ద లోటు. మనన్ వోహ్రా, కరణ్ శర్మ జట్టులోకి వచ్చారు..' లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా తెలిపాడు.
తుది జట్లు ఇలా..
లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
Also Read: Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం
Also Read: CM KCR: కల్లుగీత కార్మికులకు శుభవార్త.. ప్రత్యేక పథకం ప్రకటించిన సీఎ కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి