Lucknow Super Giants Vs Chennai Super Kings Preview: రెండు వరుస ఓటముల తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు తలపడనుంది. అటు లక్నో కూడా తన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో ఓటమిపాలైంది. ఈ తరుణంలో రెండు జట్లు కూడా మళ్లీ గెలుపుబాట పట్టాలని చూస్తోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లలో 5 గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. లక్నో హోమ్ గ్రౌండ్ ఎకానాలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్లేయింగ్ XI, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్, డ్రీమ్ 11 టీమ్ వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్..
లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలోని పిచ్ పూర్తిగా బౌలర్లకు సహరిస్తుంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం అంత ఈజీగా కాదు. 120 పరుగుల లక్ష్యం ఛేదించడం కూడా కష్టతరంగా మారనుంది. లక్నో, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో కూడా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఈ పిచ్‌పై ఎక్కువగా స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. లక్నోలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 147 పరుగులుగా ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లోనే తలపడ్డాయి. తలో మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో కూడా లోస్కోరింగ్ గేమ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లు సమతూకంగా ఉండడంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది ముందుగా అంచనా వేయడం కష్టంగా మారింది. టాస్ గెలిచిన జట్టుకు విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
తుది జట్లు ఇలా.. (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా.
చెన్నై సూపర్ జెయింట్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మతిషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మిచెల్ సాంట్నర్.
డ్రీమ్ 11 టీమ్ ఇలా..
కీపర్: నికోలస్ పూరన్, డెవాన్ కాన్వే
బ్యాట్స్‌మెన్: ఆయుష్ బదోని, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు: తుషార్ దేశ్‌పాండే, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్
Also Read: Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్
Also Read: Aadhar Update 2023: ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబరు లింక్ చేశారా..? ఈజీగా తెలుసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి