IPL 2023 CSK vs MI: మరోసారి ఓడిన ముంబై, విజయంతో రెండవ స్థానానికి చేరుకున్న చెన్నై

IPL 2023 CSK vs MI: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి పాలైంది. చెన్నై సూపర్‌కింగ్స్ అద్భత విజయంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేనకు పరాభవం తప్పలేదు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2023, 07:59 PM IST
IPL 2023 CSK vs MI: మరోసారి ఓడిన ముంబై, విజయంతో రెండవ స్థానానికి చేరుకున్న చెన్నై

IPL 2023 CSK vs MI: ఐపీఎల్ 2023లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ మరో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై వరుసగా రెండవ విజయం నమోదు చేసింది. చెన్నై హోం పిచ్‌పై చెన్నై అదరగొట్టింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ చెన్నై రాణించడంతో విజయం సునాయసమైంది.

చెన్నై చేపాక్ స్డేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరూన్ గ్రీన్, తుషార్ దేశ్‌పాండేలు ప్రారంభంలోనే క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగారు.  రోహిత్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 7 పరుగులకు అవుటయ్యాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో స్వల్ప స్కోరే చేయగలిగింది. నేహాల్ వదేరా ఒక్కడే 51 బంతుల్లో 64 పరుగుల స్కోరు సాధించాడు.

140 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్లు రుతురాత్ గైక్వాడ్, డేవాన్ కాన్వేలు అదరగొట్టే శుభారంభం చేశారు. తొలి 4 ఓవర్లలోనే 46 పరుగులు సాధించారు. 81 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత రాయుడు, శివమ్ దూబేలు చెన్నైకు కావల్సిన విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరణా 3 వికెట్లు దక్కించుకున్నాడు. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండేలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

ముంబై ఇండియన్స్ జట్టుపై విజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 13 పాయింట్లతో రెండవ స్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ మాత్రం 10 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు, 5 పరాజయాలతో పట్టికలో ఆరవ స్థానంలో ఉంది.

Also read: Rohit Sharma Ducks in IPL: రోహిత్ శర్మ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News