IPL Qualifier 1 Gujarat Vs Rajasthan: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో జోస్ బట్లర్ 2 సిక్సులు, 12 ఫోర్లతో 89 (56), కెప్టెన్ సంజూ శాంసన్ 3 సిక్సులు, 5 ఫోర్లతో 47 (26) పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో దేవత్ పడిక్కల్ (28) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.
ఓపెనర్ జోస్ బట్లర్ చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి రనౌట్‌గా వెనుదిరిగాడు. బట్లర్ రనౌట్ అయిన తర్వాతి బంతికే రియాన్ పరాగ్ కూడా రనౌట్ అయ్యాడు. ఎక్స్‌ట్రాలతో కలిపి చివరి ఓవర్‌లో రాజస్తాన్ మొత్తం 15 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, యశ్ దయాల్, హార్దిక్ పాండ్యా, సాయి కిశోర్ తలో వికెట్ తీశారు. బౌలర్ రషీద్ ఖాన్ వికెట్లేమీ తీయనప్పటికీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లనుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతుంది. ఆ మ్యాచ్‌లో నెగ్గితే ఫైనల్లో ఆడే అవకాశం ఉంటుంది. లక్నో సూజర్ జెయింట్స్-బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ జట్టు తాజా క్వాలిఫయర్ 1లోనూ అదే జోరు కొనసాగిస్తుందా.. లేక రాజస్తాన్ గుజరాత్‌కు బ్రేక్ వేస్తుందా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
Also Read: Simbu Father Health: ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో శింబు తండ్రి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook