IPL Eliminator Match: లక్నోపై బెంగళూరు విక్టరీ... 14 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్..

IPL Eliminator Match: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 12:56 AM IST
  • ఐపీఎల్ లేటెస్ట్ అప్‌డేట్స్
  • ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై బెంగళూరు గెలుపు
  • క్వాలిఫయర్ 2లో రాజస్తాన్‌తో తలపడనున్న బెంగళూరు
 IPL Eliminator Match: లక్నోపై బెంగళూరు విక్టరీ... 14 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్..

IPL Eliminator Match: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా... లక్నో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులే చేయడంతో బెంగళూరు14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

లక్నో బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 79 (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీపక్ హుడా 45 (26) పరుగులతో రాణించాడు. రాహుల్-హుడా క్రీజులో ఉన్నంతసేపు లక్నో‌ గెలుపుపై కొంతవరకు ఆశలున్నాయి. కానీ హుడా ఔట్ అయ్యాక.. రాహుల్‌కు మరో ఎండ్ నుంచి సహకారం కరువైంది. చివరకు, 19వ ఓవర్‌లో 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ కూడా నిష్క్రమించడంతో లక్నో గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివరి ఓవర్లలో దూకుడుగా ఆడటంలో లక్నో బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు జట్టులో రజత్ పటీదార్ సెంచరీతో మెరిశాడు. రజత్ 7 సిక్సులు, 12 ఫోర్లతో 54 బంతుల్లోనే 112 పరుగులు బాదాడు. బెంగళూరు 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో రజత్ కీలకంగా వ్యవహరించాడు. దినేశ్ కార్తీక్ 37 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ఇంటి దారి పట్టింది. తాజా గెలుపుతో బెంగళూరు జట్టు క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ జట్టుతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలుపొందే జట్టు ఫైనల్ చేరుతుంది. క్వాలిఫయర్ 2 అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఈ నెల 27న జరగనుంది. 

Also Read: TV Actor Killed: జమ్మూకశ్మీర్‌లో దారుణం... టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు... 

Also Read: Hyderabad As Life Sciences Capital: లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్.. దావోస్‌‌లో మంత్రి కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News