IPL 2024 KKR vs SRH Live: ట్రావిస్ హెడ్‌ 'రాత' మారలేదు.. ఈ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్లు

Travis Head Golden Dock Outs In IPL: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుత ఫామ్‌తో ఉన్న ట్రావిస్‌ హెడ్‌ ఆఖరి మ్యాచ్‌ల్లో తడబడ్డాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి హెడ్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 26, 2024, 08:22 PM IST
IPL 2024 KKR vs SRH Live: ట్రావిస్ హెడ్‌ 'రాత' మారలేదు.. ఈ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్లు

Travis Head: మరోసారి ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కసి మీద ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ట్రావిస్‌ హెడ్‌ తలనొప్పిగా మారాడు. లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్‌తో హెడ్‌ బీభత్సంగా ఆడిన ట్రావిస్‌ హెడ్‌ ఐపీఎల్‌ ఆఖరి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా రెండుసార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన హెడ్‌ కీలకమైన ఐపీఎల్‌ ఫైనల్లోనూ తీవ్ర నిరాశపర్చాడు. మరోసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు.

Also Read: SRH vs RR Highlights: ఫైనల్లోకి సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ సంబరాలు మామూలుగా లేవు

ఈ సీజన్‌లో ట్రావిస్‌ హెడ్‌ పరుగులతో బీభత్సం సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో జట్టు అత్యధిక పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌ అనంతరం తన ఫామ్‌ కోల్పోయాడు. లీగ్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ఈ బీభత్సమైన బ్యాటర్‌ కీలకమైన మ్యాచ్‌ల్లో మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చడం హైదరాబాద్‌ అభిమానులను కలవరానికి గురి చేశాడు. 1 సెంచరీ, 4 అర్ధ శతకాలు చేసిన ట్రావిస్‌ హెడ్‌ కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటకపోవడంతో గతంలో చేసిన ఇన్నింగ్స్‌ అభిమానులు మరచిపోవాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లు అభిమానించిన వారు కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటకపోవడంతో విమర్శలు చేస్తున్నారు.

Also Read: RR vs RCB: బెంగళూరుకు తీరని ఐపీఎల్‌ ట్రోఫీ కల.. రాజస్థాన్‌ చేతిలో ఓటమి

చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో హెడ్‌ మరోసారి గోల్డెన్‌ డకౌట్‌తో వెనుదిరిగాడు. వైభవ్‌ అరోరా వేసిన బౌలింగ్‌లో ఒక్క పరుగు చేయకుండానే వెనుతిరిగాడు. భారీ పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తే సున్నాతో వెనుదిరగడంతో అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న హెడ్‌ ఇలా నిరాశపర్చడం మింగుడుపడని విషయం. 

డకౌట్లు ఇలా..
​- పంజాబ్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు.
- అహ్మదాబాద్‌ వేదికగా మే 21వ తేదీన జరిగిన కేకేఆర్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన అద్భుతమైన డెలివరీకి హెడ్‌ చిక్కి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. తొలి ఓవర్‌ రెండో బంతికే హెడ్‌ చిక్కడం హైదరాబాద్‌ అభిమానులను నిరాశపర్చింది.
- కానీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ట్రావిస్‌ హెడ్‌ 34 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ఐపీఎల్‌లో హెడ్‌ ప్రదర్శన

  • ఐపీఎల్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌ ఆడాడు. 
  • 199.63 స్ట్రైక్‌ రేటు, యావరేజ్‌ స్కోర్‌ 44.42 
  • మొత్తం 567 పరుగులు చేశాడు. 
  • వాటిలో ఒక సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.
  • డకౌట్‌లు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News