Rajat Patidar: ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓ మెరుపులా మెరిశాడు. వేలంలో పట్టించుకోనందుకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అవకాశమిచ్చిన జట్టుకు అద్భుత సెంచరీతో రుణం తీర్చుకున్నాడు.
ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్ ..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికరంగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయంతో..క్వాలిఫయర్ 2కు చేరుకుంది ఆర్సీబీ. ఆర్సీబీ విజయానికి మూలస్థంభంగా మారాడు రజత్ పటిదార్. అద్బుతమైన ఫాస్టెస్ట్ సెంచరీతో బెంగళూరు విజయానికి కారణమయ్యాడు. గత రెండు సీజన్లలో ఎలిమినేటర్ దాటని ఆర్సీబీ..ఈసారి ఆ గండం నుంచి గట్టెక్కింది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ప్రారంభంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ పేలవంగానే సాగింది. డుప్లెసిస్ డకవుట్ కావడం, విరాట్ కోహ్లీ 25 పరుగులకే వెనుదిరగడం..మ్యాక్స్‌వెల్, లోమ్రోర్ విఫలం కావడంతో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. ఇక అక్కడి నుంచి రజత్ పటిదార్ ఇన్నింగ్స్ స్వరూపమే మార్చేశాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 54 బంతుల్లో 112 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. రజత్ పాటిదార్‌కు తోడుగా దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
వేలంలో పట్టించుకోనందుకు సెంచరీతో సమాధానం
వాస్తవానికి గత సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన రజత్ పటిదార్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ మెగావేలంలో ఏ జట్టు అతడిని పట్టించుకోలేదు. రెండు లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తరువాత..ఆర్సీబీ మరోసారి అవకాశమిచ్చింది. గాయపడి జట్టు నుంచి తప్పుకున్న సిసోడియా స్థానంలో స్థానం లభించింది. లీగ్ దశలో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఎలిమినేటర్ పోరులో పటిదార్‌పై నమ్మకంతో..ప్రయోగం చేసింది ఆర్సీబీ. మూడవ స్థానంలో పంపించింది. అంతే తన కెరీర్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందరి నోళ్లు మూయించాడు.
Also read: Jos Buttler IPL Record: జోస్ బట్లర్ రేర్ రికార్డు.. ఒకే సీజన్లో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి