GT vs RCB: గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నేడే, విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే ఆశలు

GT vs RCB: ఐపీఎల్ 2022లో రెండవ దశ ప్రారంభమైపోయింది. పాయింట్ల పట్టికలో దిగువ ఉన్న జట్లకు చావో రేవో పరిస్థితి ఉంటే..మిగిలిన జట్లకు ఆధిక్యంపై ఆశలుంటాయి. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరిది పైచేయి అనేది పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2022, 02:51 PM IST
  • ఆర్సీబీకు కీలకమైన మ్యాచ్ నేడు
  • గుజరాత్ టైటాన్స్‌పై విజయం కోసం తహతహ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో వచ్చేనా
  • ఇదే పిచ్‌పై ఎస్ఆర్‌హెచ్ చేతిలో 68 పరుగులకు ఆలవుట్
GT vs RCB: గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నేడే, విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే ఆశలు

GT vs RCB: ఐపీఎల్ 2022లో రెండవ దశ ప్రారంభమైపోయింది. పాయింట్ల పట్టికలో దిగువ ఉన్న జట్లకు చావో రేవో పరిస్థితి ఉంటే..మిగిలిన జట్లకు ఆధిక్యంపై ఆశలుంటాయి. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎవరిది పైచేయి అనేది పరిశీలిద్దాం..

ఐపీఎల్‌లో ఇవాళ జరగనున్న ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కీలకంగా మారనుంది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది గెలవక తప్పని మ్యాచ్. ఎందుకంటే ఉండేకొద్దీ పోటీలు ప్రతి ఒక్క జట్టుకు కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే..ఆర్సీబీ పది పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్సీబీ ఇప్పటికే 9 మ్యాచ్‌లు ఆడింది. ఇవాళ జరిగేది ఆర్సీబీ జట్టుకు పదవ మ్యాచ్. 

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. శుభమన్ గిల్ ఫామ్‌లో లేకపోయినా..హార్దిక్ పాండ్యా, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్‌లు ఫామ్‌లో ఉన్నారని చెప్పవచ్చు. బౌలింగ్ విషయంలో మొహమ్మద్ షమీ, ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో బ్యాటింగ్ పరంగా జట్టు బలహీనంగా ఉంది. మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం, కెప్టెన్ డుప్లెసిస్ నిలకడగా రాణించకపోవడం జట్టుకు ప్రధాన బలహీనతగా ఉంది. 

ఈ పిచ్ బౌలర్లకు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇదే పిచ్‌పై ఆర్సీబీ జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 68 పరుగులకే ఆలవుట్ అయింది. 

Also read: Shubman to Musk to Buy Swiggy: స్విగ్గీని కొనండి.. మస్క్‌కు శుభ్‌మన్ సలహా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News