IPL 2021 Dates, Schedule: BCCI To Host IPL 2021 In India: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నిర్వహణపై ఈ ఏడాది ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఏప్రిల్-జూన్ నెలల మధ్య భారత్ వేదికగానే IPL 2021 జరగనుంది.
మరోవైపు ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఈ సీజన్‌కు సంబంధించి మినీ వేలానికి బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్, 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. అయితే ఐపీఎల్ 2021(IPL 2021 Latest Update) సీజన్ కోసం నిర్వహించనున్న మినీ వేలం అనంతరం లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కోశాధికారి తెలిపినట్లు సమాచారం.
Also Read: Ranji Trophy 2020-21: 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి రద్దైన దేశవాళీ రంజీ క్రికెట్ టోర్నీ
మార్చి 28న ఇంగ్లాండ్, భారత్(Team India) జట్ల మధ్య సిరీస్‌లు ముగియనున్నాయి. కాగా, సిరీస్ ముగిసిన 14వ రోజే ఐపీఎల్ 14 ప్రారంభం కానుంది. ఏప్రిల్ 11వ తేదిన ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే వారం రోజుల విశ్రాంతి ఇవ్వనుంది బీసీసీఐ.
Also Read: Vijay Shankar Wedding Photos: పెళ్లిపీటలు ఎక్కిన Team India క్రికెటర్ విజయ్ శంకర్
వారం రోజుల విశ్రాంతి అనంతరం మరో 6 రోజులపాటు బయో సెక్యూర్ బబుల్‌లో ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే. 6 నెలలు ఆలస్యంగా ఐపీఎల్ 13వ సీజన్ జరిగింది. ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఆటగాళ్లకు వ్యాక్సిన్ సైతం వేయించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.
Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం తేదీ, వేదిక ఖరారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook