IPL 2020 - CSK vs SRH match Netizens slam MS Dhoni : న్యూఢిల్లీ: ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంపైర్ పాల్ రైఫిల్ (umpire Paul Reiffel ) ఇవ్వబోయిన వైడ్ నిర్ణయాన్ని ధోనీ అడ్డుకోవడం పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ధోని అంపైర్‌ను బెదిరించి వైడ్ ఇవ్వకుండా అడ్డుకున్నాడంటూ ధోనిని హైదరాబాద్ జట్టు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. శర్దూల్ థాకూర్ (Shardul Thakur) వేసిన బౌలింగ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. Also read: David Warner: SRH ఓటమిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే!
సన్‌రైజర్స్ 11 బంతుల్లో 24 రన్స్ చేయాల్సిన సందర్భంలో.. శార్దూల్ మొదట వైడ్ బాల్ వేశాడు. ఆ తర్వాత బంతిని కూడా శార్దుల్ అదే విధంగా వేశాడు. ఈ క్రమంలో అంపైర్ రైఫిల్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటిద్దామని చేతులు చాస్తుండగా.. కీపర్ ధోనీ ఆ బంతి వైడ్ కాదన్న సంకేతాన్ని ఇచ్చాడు. వైడ్ సిగ్నల్ ఇచ్చేందుకు చేతులు చాపుతున్న అంపైర్‌ను.. ధోనీ తన సంకేతంతో అడ్డుకున్నాడు. ధోని వైపు చూసిన అంపైర్ రైఫిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ ఘటన పట్ల హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ధోని అంపైర్‌ను తన సైగలతో బెదిరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
No one:
Dhoni fans tomorrow:#Dhoni #SRHvsCSK pic.twitter.com/aKJBAMpDaX— suGUN (@Ravipalli_Sugun) October 13, 2020
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు), బెయిర్ స్టో (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది. Also read: CSK vs SRH: హైదరాబాద్‌పై ధోని సేన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe