Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ విఫలం.. మోర్గాన్‌ అయితే బెస్ట్: శ్రీశాంత్

కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ చేతికి అప్పగించాలని, అదే సరైన నిర్ణయమని భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అంటున్నాడు.

Last Updated : Oct 4, 2020, 12:20 PM IST
  • కోల్‌కతా నైట్ రైడర్స్ బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ కి అప్పగించాలని, అదే సరైన నిర్ణయమని భారత బౌలర్ శ్రీశాంత్ అంటున్నాడు
  • ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ కేకేఆర్‌కు కెప్టెన్‌గా సమర్థుడు అని పేర్కొన్న భారత పేసర్
  • దినేష్ కార్తీక్‌కు కెప్టెన్సీ అనేది భారంగా మారింది. అతడికి కెప్టెన్సీ అనుభవం లేక కేకేఆర్ ఫలితాలపై ప్రభావం చూపుతుంది
Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ విఫలం.. మోర్గాన్‌ అయితే బెస్ట్: శ్రీశాంత్

కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ చేతికి అప్పగించాలని, అదే సరైన నిర్ణయమని భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ (Dinesh Karthik) సారథ్యంలోని కేకేఆర్ జట్టు 18 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా దినేష్ కార్తీక్ కెప్టెన్సీ కారణంగానే కేకేఆర్ రాణించడం లేదని, విజయం ముంగిట జట్టు బోల్తా పడుతుందని శ్రీశాంత్ సహా పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read : DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer

‘ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ కేకేఆర్‌కు కెప్టెన్‌గా సమర్థుడు. అతడ్ని కాదని దినేష్ కార్తీక్‌కు పగ్గాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. రోహిత్ వర్మ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాగ ముందుండి జట్టును నడిపించే కెప్టెన్ అవసరం కేకేఆర్‌కు ఎంతైనా ఉంది. విజయం ముంగిట కేకేఆర్ బోల్తా పడుతుంది. కార్తీక్ కన్నా మోర్గాన్ బెస్ట్ కెప్టెన్ అని’ శ్రీశాంత్ పేర్కొన్నాడు.

Also Read:  Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

 

కాగా, శ్రీశాంత్ చెప్పింది అక్షరాలా నిజం. జట్టును నడిపించే వ్యక్తి తన వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. దినేష్ కార్తీక్‌కు కెప్టెన్సీ అనేది భారంగా మారింది. అతడికి కెప్టెన్సీ అనుభవం లేక కేకేఆర్ ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కేవలం ఆటగాళ్ల ప్రదర్శనతో కొన్ని మ్యాచ్‌లు నెట్టుకురావచ్చు కానీ ఐపీఎల్ టోర్నీ సాధించడం అంత సులువు కాదు. కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాక ఆటగాడిగా సైతం కార్తీక్ విఫలమవుతున్నాడని సొంత జట్టులోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: Jonny Bairstow: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఇంగ్లాండ్ షాక్.. కోట్లలో నష్టం! 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News