India Won Against South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత క్రికెటర్లు చెలరేగి ఆడారు. బ్యాటింగ్‌లో దుమ్మురేపగా.. బంతులతోనూ నిప్పులు చెలరేగి ఆడి తొలి టీ20 మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. సంజూ శాంసన్ వీరోచిత బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించగా.. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి వికెట్లు టపటపా తీయడంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు భారీ షాక్ ఇచ్చారు.
Also Read: Ind vs SA T20 Live: డర్బన్‌లో సిక్సర్లతో సంజూ సెంచరీ.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
టాస్ నెగ్గి చేజింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు భారత్ ఇచ్చిన 203 లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. ఆరంభంలో కాస్త దూకుడుగా ఆడగా.. పవర్ ప్లే అనంతరం బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి నిప్పుల్లాంటి బంతులు వేయడంతో ఒక్క బ్యాటర్ కూడా ఎక్కువసేపు గ్రౌండ్‌లో నిలువలేకపోయారు. హెన్రిచ్ క్లాసెన్ చేసిన 25 పరుగులే అత్యధిక పరుగులు కావడం గమనార్హం. అతికష్టంగా 17.5 ఓవర్ల వరకు మ్యాచ్‌ను లాగారు. 141 పరుగులకు కుప్పకూలిపోయి సొంత గడ్డలో ఎదురుదెబ్బ ఎదుర్కొంది. ఓపెనర్లుగా దిగిన మార్‌క్రమ్ (8), రియాన్ రికల్టన్ (21) మొదలుకుని క్లాసెన్ (25), డేవిడ్ మిల్లర్ (18) వంటి బ్యాటర్లే చేతులెత్తేయడంతో ఆ తర్వాత వచ్చిన వారంతా బ్యాట్ ఝుళిపించడంలో విఫలమై మ్యాచ్‌ను చేజార్చుకున్నారు.
భారత్ భళా
బ్యాటర్లు విధించిన భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు పరిరక్షించారు. 17.5 ఓవర్లకే మ్యాచ్‌ను ముగించారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మూడు వికెట్లు చొప్పున తీయగా.. అవేశ్ ఖాన్ రెండు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ మన ఆటగాళ్లు భళా అనిపించారు. సమష్టి కృషితో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.
హైదరాబాద్ గడ్డపై భారీ సెంచరీతో విరుచుకుపడిన సంజూ శాంసన్ అదే ఉత్సాహంతో దక్షిణాఫ్రికాపై బ్యాట్‌తో విరుచుకుపడి అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. పరుగులు తీయడం బద్దకంగా భావించాడేమో అన్నట్టు సిక్స్‌లు.. ఫోర్లతో విరుచుకుపడి సెంచరీ బాదేశాడు. 10 సిక్స్‌లు.. 7 ఫోర్లతో సంజూ 107 పరుగులు మోత మోగించగా.. భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
డర్బన్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ నెగ్గి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆడిన సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాలో కూడా అదే దూకుడు కనబర్చాడు. ఓపెనర్‌గా దిగిన సంజూ 50 బంతుల్లో 107 పరుగులు చేసి తనకు తిరుగులేదని నిరూపించాడు. 10 సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ రోహిత్ రికార్డును తిరగరాశాడు. 7 ఫోర్లు చేసి తన టీ20 కెరీర్‌లో రెండో శతకాన్ని బాదాడు. అభిషేక్ శర్మ (7) రెండంకెల పరుగులు చేయలేకపోగా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ భారీ పరుగులు చేసే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చేసి 33 పరుగులకు పరిమితమయ్యాడు. బర్త్ డే రోజు చిరస్మరణీయ బ్యాటింగ్ ఆశించగా తిలక్‌కు నిరాశ మిగిలింది. సూర్య కుమార్ యాదవ్ (21), రింకూ సింగ్ (11) పరుగులతో పర్వాలేదనిపించాడు. హార్దిక్ పాండ్యా (2) తీవ్ర నిరాశపర్చగా.. అక్షర్ పటేల్ (7) బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు.
దక్షిణాఫ్రికా బౌలింగ్ మొదట పేలవంగా వేయగా.. ఓవర్లు ముగిసే కొద్ది కట్టుదిట్టంగా వేసి భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేసింది. సంజూ శాంసన్ గ్రౌండ్‌లో ఉన్నంత వరకు బౌలర్లు తేలిపోగా.. అతడు ఔటయిన తర్వాత మెరుగైన బౌలింగ్ వేశారు. గెరాల్డ్ కాట్జీ 3 వికెట్లు పడగొట్టి భారత్‌కు భారీ దెబ్బ తీశాడు. నాబా పీటర్ ఒక వికెట్ తీసినా కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్న సంజూను పెవిలియన్ పంపించడం విశేషం. ఇక మార్కో జాన్సన్, పాట్రిక్ క్రుగర్, కేశవ్ మహరాజ్ తలా ఒక్కో వికెట్ తీశారు. 230 నుంచి 250 పరుగులు చేయాలని భారత్ విధించుకున్న లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బౌలర్లు నీరు గార్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Ind vs SA Highlights: దక్షిణాఫ్రికాపై భారత్ పంజా.. తొలి టీ20లో భారీ విజయం