Ind vs SA T20I Third Live: నాలుగు మ్యాచ్‌ల సిరీస్ సమమైన వేళ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ పరుగుల వరద పారించింది. తెలంగాణ పోరడు తిలక్ వర్మ సిక్సర్లతో విరుచుకుపడడంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని విధించింది. గత మ్యాచ్ ఓటమితో నైరాశ్యంలో ఉన్న ఆటగాళ్లు పుంజుకుని దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు పర్వాలేదనిపించిన వేళ మిడిలార్డర్ నిలబడింది.
Also Read: SA vs Ind Live T20I Live: కసి తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో భారత్ ఘోర వైఫల్యం
సెంచూరియన్ స్టేడియంలో బుధవారం జరిగిన మూడో టీ20లో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ 219 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకున్న అనంతరం అభిషేక్ శర్మతో కలిసి తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ బ్యాట్‌తో దుమ్ముధులిపాడు. 25 బంతుల్లో అభిషేక్ అర్ధ శతకం నమోదు చేయగా.. అతడి సహాయంతో తిలక్ వర్మ శతకం బాదేశాడు.
సిక్సర్లలతో
56 బంతుల్లోనే 107 పరుగులు చేసి తిలక్ వర్మ తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 8 ఫోర్లు చేసి తన స్కోరును పెంచేయగా.. 7 సిక్సర్లతో తన శతకాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక్క పరుగుకే ఔటవగా.. హార్దిక్ పాండ్యా (18), రింకూసింగ్ (8) కొద్దిసేపు నిలబడి వెళ్లారు. బ్యాటర్‌గా గ్రౌండ్‌లోకి తొలిసారి అడుగుపెట్టిన రమణ్‌దీప్ సింగ్‌లో కూడా బ్యాటర్ దాగి ఉన్నాడని నిరూపణ అయ్యింది. 6 బంతుల్లో 15 పరుగులు రాబట్టడంతోపాటు అందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉండడం విశేషం.
Also Read: Ind vs SA Highlights: దక్షిణాఫ్రికాపై భారత్ పంజా.. తొలి టీ20లో భారీ విజయం
గత మ్యాచ్ విజయోత్సాహంతో ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగిన ప్రొటీస్ భారత్‌ను స్కోర్ చేయకుండా నిలువరించలేకపోయింది. పవర్ ప్లే మొదలుకుని ఆఖరి రెండు ఓవర్లు మినహా దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు. అండిల్ సిమెలేన్, కేశవ్ మహారాజ్ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.
తిలక్ వర్మ కుమ్ముడు
తెలంగాణకు చెందిన తిలక్ వర్మ నమోదు చేసిన సెంచరీపైనే క్రీడా ప్రపంచం చర్చించుకుంటోంది. దక్షిణాఫ్రికా సిరీస్ తొలి మ్యాచ్‌లో పుట్టినరోజు చేసుకున్న తిలక్ వర్మ ఆ రోజే సెంచరీ నమోదు చేయాలని ప్రయత్నం చేయగా నిరాశ ఎదురైంది. ఐదు రోజుల ఆలస్యంగా మూడో మ్యాచ్‌లో తిలక్ తన కలను తీర్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన తెలుగు ఆటగాడిగా తిలక్ చరిత్ర పుటల్లో నిలిచాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tilak Varma: సిక్సర్లతో చెలరేగిన తిలక్ వర్మ.. దక్షిణాఫ్రికాపై టీ20లో తొలి సెంచరీ