India vs South Africa: నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా యోచిస్తోంది. నాలుగో మ్యాచ్‌లో విజయ ఢంకా మోగించి సిరీస్ ఎత్తుకెళ్లాలని సౌతాఫ్రికా టీమ్ స్కెచ్‌లు వేస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలక కానుండటంతో ఆట రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మనోళ్లు ఆదరగొట్టినా..బౌలింగ్‌లో తేలిపోయారు. భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయారు. రెండో మ్యాచ్‌లో 140 ప్లస్ స్కోర్ చేసి ..ఆ పరుగులోపే సఫారీని చుట్టేయలేకపోయారు. మూడో మ్యాచ్‌లో మాత్రం టీమిండియా అన్ని విభాగాల్లో రాణించింది. మొదటి పది ఓవర్లలో భారీ స్కోర్ చేసినా..ఆ తర్వాత భారత బ్యాటింగ్ గాడి తప్పింది. ఐనా దక్షిణాఫ్రికా ముందు మంచి లక్ష్యాన్ని ఉంచారు.
బంతి అందుకున్న భారత బౌలర్లు..సౌతాఫ్రికా టాప్, మిడిల్ ఆర్డర్ కూల్చి వేశారు. 40కిపైగా పరుగులతో విజయం సాధించారు. ఇప్పుడు ఇదే ఊపును నాలుగో మ్యాచ్‌లో చూపించాలని క్రికెట్ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. టాప్ ఆర్డర్‌లో గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఐతే పంత్ ఫామ్ కలవర పెడుతోంది. అతడు ఎప్పుడు ఆడతాడో..ఎప్పుడు విఫలమవుతాడో తెలియడం లేదు.
హార్థిక్ పాండ్యా ..తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కీలక వికెట్లు తీశాడు. అతడికి ఎదుర్కొనేందుకు సఫారీ జట్టుకు కష్టంగా మారుతోంది. ఇటు ఆవేష్‌ఖాన్, హర్షల్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నారు. ప్రధాన స్పినర్నర్ చాహల్..మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా..కీలక మూడో ఆటలో మాత్రం రెచ్చిపోయాడు.
మొత్తంగా నాలుగో మ్యాచ్‌లో భారత టీమ్‌లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆడిన జట్టే నాలుగో మ్యాచ్‌కు బరిలోకి దిగేలా కనిపిస్తోంది. ఆవేష్ ఖాన్‌కు గాయమైంది. ఒకవేళ అతడు ఆడకపోతే ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ ఎలాంటి మార్పు ఉండే పరిస్థితి లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇటు దక్షిణాఫ్రికా మాత్రం మార్పులు చేసే అవకాశం ఉంది.
రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఐతే ఇవాళ పిచ్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకు జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది.
తుది జట్లు ఇవే..!
టీమిండియా: గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, పంత్(కెప్టెన్/ కీపర్), పాండ్యా, దినేష్ కార్తీక్,అక్షర్/రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్, ఆవేష్, చాహల్.
సౌతాఫ్రికా: డికాక్/ హెండ్రిక్స్, బవుమా,డసెన్, ప్రిటోరియస్, మిల్లర్, క్లాసెన్, పార్నెల్, రబాడ, నోకియా, మహరాజ్, షంసి.
Also read:Rohit Sharma News: అవన్నీ అసత్య వార్తలు.. రోహిత్ శర్మకు ఏమీ కాలేదు!
Also read: Maharashtra: 5 వందలడిగితే..5 రెట్లు ఎక్కువగా 2 వేల 5 వందలిస్తానంటున్న ఏటీఎం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook