IND vs SA 1st ODI Preview: సౌతాఫ్రికాతో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోయిన టీమ్ఇండియా.. ఇప్పుడు పరిమిత ఓవర్ల కోసం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నేటి (జనవరి 19) నుంచి ప్రారంభం కానున్న తొలి వన్డేలో ఇండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. పార్ల్ వేదికగా జరగనున్న మొదటి మ్యాచులో భారత కెప్టెన్ గా కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇప్పటి వరకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు బ్యాటర్ గా కొనసాగనున్నాడు.
విరాట్ కోహ్లీ టీమ్ఇండియా కెప్టెన్ గా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన నేపథ్యంలో అతడి బ్యాటింగ్ పై అందరి దృష్టి మళ్లింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో అందుకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.
గతసారి దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 5-1తో నెగ్గిన టీమ్ఇండియా ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. చివరిగా గత ఏడాది మార్చిలో భారత్ ఇంగ్లాండ్‌తో పూర్తిస్థాయి వన్డే జట్టుతో ఆడింది. ఆ తర్వాత జులైలో శ్రీలంక పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లింది.
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్!
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడిన కేఎల్ రాహుల్ ఈసారి శిఖర్ ధావన్‌కు తోడుగా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్‌కు ఈ వన్డే సిరీస్ కీలకంగా మారింది. దేశవాళీ క్రికెట్‌లో రాణించి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ వన్డే అరంగేట్రం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రావొచ్చు. అలాగే నాలుగు, అయిదు స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. వికెట్ కీపర్, బ్యాటర్ గా రిషభ్ పంత్ ఐదు లేదా ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో వెంకటేశ్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది.
బౌలింగ్ దళం
జట్టులో స్పిన్నర్లుగా అశ్విన్, యజువేంద్ర చాహల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు పేసర్లుగా జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి రావడం పక్కాగా కనిపిస్తుంది. అయితే మూడో పేసర్ ఎవర్ని ఎంచుకుంటారనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
మూడో పేసర్ స్థానం కోసం దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ మధ్య పోటీ నెలకొంది. టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడ్డ మహమ్మద్ సిరాజ్ కూడా ఫిట్‌నెస్ సాధించాడు.
Also Read: Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ
Also Read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే ప్రాంతాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook