Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు ముందు పాక్ కీలక నిర్ణయం.. రషీద్‌ వచ్చేశాడు!

Umar Rasheed left for UAE as a Pakistan Fast bowling coach. ఇంగ్లండ్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ ఉమర్ రషీద్‌ను పాక్ అసిస్టెంట్‌ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పీసీబీ నియమించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 01:09 PM IST
  • ఆసియా కప్‌ 2022కు ముందు పాక్ కీలక నిర్ణయం
  • రషీద్‌ వచ్చేశాడు
  • షాన్ టైట్‌తో కలిసి పనిచేయనున్న రషీద్‌
Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు ముందు పాక్ కీలక నిర్ణయం.. రషీద్‌ వచ్చేశాడు!

PCB appoints Umer Rashid as Pakistan Fast bowling coach for Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ ఉమర్ రషీద్‌ను పాక్ అసిస్టెంట్‌ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అంతేకాదు మెగా టోర్నీ జరిగే యూఏఈకి రషీద్‌ను పంపించింది. ఉమర్ రషీద్‌ ప్రస్తుతం‌ లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బౌలింగ్‌ కోచ్‌గా చేస్తున్నాడు. మొహమ్మద్ హస్నైన్ వంటి బౌలర్లను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

ఆసియా కప్‌ 2022లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌ షాన్ టైట్‌తో కలిసి ఉమర్ రషీద్‌ పనిచేయనున్నాడు. పాక్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ సిఫార్సు మేరకు రషీద్‌ పాక్ జట్టు కోచింగ్ బృందంలో చేరాడు. రషీద్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో మిడిల్‌సెక్స్, సస్సెక్స్‌ జట్ల తరపున ఆడాడు. మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఇండో-పాక్ జట్లు ప్రాక్టీస్‌ను మొదలెట్టాయి.

ఆసియా కప్‌ 2022కు స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్‌ మొహమ్మద్ హస్నైన్‌ను పీసీబీ ఎంపిక చేసింది. గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో షాహీన్ కుడి మోకాలికి గాయమైంది. 22 ఏళ్ల హస్నైన్ పాకిస్థాన్ తరఫున 18 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆటగాడిపై పాక్ భారీ ఆశలు పెట్టుకుంది.  

పాకిస్తాన్‌ జట్టు: 
బాబర్‌ ఆజామ్ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్‌, షాబాద్‌ ఖాన్‌, ఆసిఫ్‌ అలీ, హైదర్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌, నసీం షా, ఉస్మాన్‌ ఖాదిర్‌, షానవాజ్‌ దహాని, మహ్మద్‌ హస్నైన్‌.

Also Read: Anupama Parameswaran Covid: అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా!

Also Read: Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా..రాకెట్ దాడిలో 22 మంది మృతి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News