India Vs New Zealand 1st T20: టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) మరో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... బుధవారం జరిగే మొదటి టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Toss Update from Jaipur:@ImRo45 has won the toss & #TeamIndia have elected bowl against New Zealand in the first T20I. @Paytm #INDvNZ
Follow the match ▶️ https://t.co/5lDM57TI6f pic.twitter.com/Z6rs2wZvHc
— BCCI (@BCCI) November 17, 2021
కెప్టెన్ రోహిత్ (Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో తొలి సమరానికి ఇండియా జట్టు సిద్ధమైంది. మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానం తొలిసారి టీ20 మ్యాచ్ కు అతిథ్యమిస్తోంది. ఇక్కడ చివరిసారి 2013లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది.
2022 ప్రపంచకప్ (T20 World cup 2022) పై దృష్టి సారించాలనుకుంటున్న టీమ్ఇండియా ఆ దిశగా ఆటగాళ్లను సిద్ధం చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు పెద్ద సమస్య. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్(Rahul Dravid) ఎవరెవరికీ ఏయే స్థానాలు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. ఇప్పడు జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. వారిలో కొందరికి మిడిల్ఆర్డర్ స్థానాలు కేటాయించడం సవాలే. రోహిత్, రాహుల్ టీ20లో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తుదిజట్లు:
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డార్యెల్ మిచెల్, మార్క చప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, మిచెల్ శాంటర్న్, టిమ్ సౌథీ (కెప్టెన్), టూడ్ అస్టల్, లోకీ ఫెర్యూసన్, ట్రెంట్ బౌల్ట్.
Also Read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..
Also Read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook