IND vs ENG: విజృంభిస్తున్న టీమిండియా స్పిన్నర్లు.. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ టైంకి స్కోరు ఎంతంటే?

Dharmashala Test Live Score: ధర్మశాల టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ధాటికి లంచ్ లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 12:50 PM IST
IND vs ENG: విజృంభిస్తున్న టీమిండియా స్పిన్నర్లు.. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ టైంకి స్కోరు ఎంతంటే?

India vs England Live Score, 5th Test Day 3: ధర్మశాల టెస్టులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. భారత స్పిన్నర్లు మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పడుతున్నారు. దీంతో స్టోక్స్ సేన లంచ్ లోపే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు వికెట్లు అశ్విన్ ఒక్కడే తీసాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ టీమ్ 5 వికెట్ల న‌ష్టానికి  103 పరుగులు చేసింది. జో రూట్  జో రూట్‌(34) క్రీజులో ఉన్నాడు. ఇంకా ఇంగ్లీష్ టీమ్ 156 పరుగలు వెనుకంజలో ఉంది. 

ఓవర్ నైట్ స్కోరు  473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ 30 పరుగులు, బుమ్రా 20 రన్స్ చేసి ఔటయ్యారు. కుల్దీప్ వికెట్ తీయడం ద్వారా అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5, అండర్సన్, హార్ట్లీ చెరో రెండు వికెట్లు తీశారు. బషీర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. భారత జట్టులో తొలి ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇది నాలుగోసారి మాత్రమే.

చరిత్ర సృష్టించిన అండర్సన్
ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గిల్, కుల్‌దీప్‌ ను ఔట్ చేయడం ద్వారా అండర్సన్ 700 వికెట్ల క్లబ్ లో చేరాడు. 41 ఏళ్ల వయసులో ఈ ఫీట్  సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 700 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా.. తొలి పేసర్ గా రికార్డు సృష్టించాడు. తొలి రెండు స్థానాల్లో మురళీ ధరన్ 800, షేన్ వార్న్ 709 వికెట్లతో ముందున్నారు. మరో పది వికెట్లు తీస్తే షేన్ వార్న్ ను రికార్డును తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. 2002లో టెస్టు ఆరంగ్రేటం చేసిన అండర్సన్ 187 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ ఇతడే కావడం విశేషం. 

Also Read: IND vs ENG 5th Test Live: రెండో రోజు కూడా మనదే.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

Also Read: Shami Political Entry: క్రికెటర్‌ షమీని అస్త్రంగా బీజేపీ బెంగాల్‌ రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News