Hardik Pandya Injury: భారత్‌కు ఎదురుదెబ్బ.. హార్థిక్ పాండ్యా గాయం.. మ్యాచ్‌ నుంచి ఔట్..!

IND vs BAN World Cup 2023 Updates: ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్‌ మధ్యలో నుంచి వైదొలిగాడు. బౌలింగ్ చేసే సమయంలో బంతి కాలితో ఆడ్డుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌కు దిగడం అనుమానంగా మారింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 19, 2023, 06:59 PM IST
Hardik Pandya Injury: భారత్‌కు ఎదురుదెబ్బ.. హార్థిక్ పాండ్యా గాయం.. మ్యాచ్‌ నుంచి ఔట్..!

IND vs BAN World Cup 2023 Updates: పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ఎడమ చీలమండతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్యా.. మూడు బంతులు వేశాడు. మూడో బంతికి లిట్టన్ దాస్ కొట్టిన షాట్‌ కొట్టగా.. పాండ్యా తన కుడి కాలుతో ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే జారిపడిపోయాడు. దీంతో తన ఎడమ కాలు మీద ఇబ్బందికరంగా ల్యాండ్ అయ్యాడు. పాండ్యా నొప్పిగా కనిపించడంతో ఫిజియో మైదానంలోకి వెళ్లి ట్రీట్‌మెంట్ చేశాడు. అయితే సరికగా రన్ చేయలేకపోవడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. 

పాండ్యా స్థానంలో మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ బౌల్ చేశాడు. చాలా రోజుల తరువాత కోహ్లీ బౌలింగ్ చేయడంతో స్టేడియం అంతా మార్మోగిపోయింది. పాండ్యాను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ మధ్యలో నుంచి పాండ్యా వెళ్లిపోవడంతో టీమిండియాకు బౌలింగ్ విభాగం కాస్త బలహీనమైంది. ఐదుగురు బౌలర్లే పూర్తి కోటా వేయాల్సి ఉంటుంది. పాండ్యా తిరిగిరాకపోతే.. 10 మందితోనే భారత్ బ్యాటింగ్ చేస్తుంది.

మొదట బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్లు లిటన్ దాస్, హాసన్ దూకుడుగా ఆడారు. మొదటి వికెట్‌కు 14.4 ఓవర్లలోనే 93 రన్స్‌ జోడించారు. అయితే ఈ శుభారంభాన్ని బంగ్లా సద్వినియోగం చేసుకోలేకయింది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో 300 పరుగుల చేస్తుందనుకున్న బంగ్లాదేశ్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులకే పరిమితమైంది. తాంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. 257 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. 

ఇది కూడా చదవండి: India Vs Bangladesh Updates: రాణించిన బౌలర్ల.. భారత్ టార్గెట్ 257..!   

ఇది కూడా చదవండి: మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన తంజావూరు కుర్రాడు.. మూడో ఇండియన్ గా రికార్డు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News