India Under 19 Captain Yash Dhull hits Century on Ranji Trophy debut: టీమిండియాకు ఐదవ అండర్-19 ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్.. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అండర్-19 ప్రపంచకప్ 2022 ఫామ్‌ను కొనసాగిస్తూ.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. దాంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈరోజు ఆరంభం అయింది.
రంజీ టోర్నీలో భాగంగా గురువారం ఉదయం బరస్పరాలోని ఏసీఏ మైదానంలో ఢిల్లీ, తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజు లంచ్ తర్వాత 136 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న యశ్ ధుల్.. 113 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి.
57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యశ్ ధుల్.. 136 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద యశ్ ఔట్ అయినా అది నో బాల్ కావడంతో బతికిపోయాడు. దాంతో రంజీ ట్రోఫీ అరంగేట్రంలో సెంచరీ నమోదు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, అమోల్ ముజుందార్, రోహిత్ శర్మ సహా ఎందరో లెజెండ్‌లు ఉన్నారు. ఇక టీమిండియాకు సారథ్యం వహించిన చివరి ఐదుగురు అండర్-19 కెప్టెన్లలో నలుగురు ఫస్ట్-క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీ చేయడం విశేషం. విజయ్ జోల్ 2013లో న్యూజిలాండ్ ఏపై 110 పరుగులు, 2017లో తమిళనాడుపై పృథ్వీ షా 120 పరుగులు, 2018లో ప్రియమ్ గార్గ్ గోవాపై 117 పరుగులు చేశారు.
FIFTY on First-Class debut! 👏 👏
Yash Dhull - India's #U19CWC-winning captain - begins his #RanjiTrophy journey in style. 👍 👍 @Paytm #DELvTN
Follow the match ▶️ https://t.co/ZIohzqOWKi pic.twitter.com/mrbYBHNrBL
— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022
తమిళనాడు లాంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేయడంతో యశ్ ధుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యశ్ ధుల్ మరో విరాట్ కోహ్లీ అవుతాడని ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మనోడికి తక్కువ ధరకే సొంతం చేసుకుంది. ఢిల్లీ 50 లక్షల రూపాయలకు ధుల్‌ను కైవసం చేసుకుంది. అయితే స్టార్లు ఉన్న ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఐపీఎల్ 2022 మర్చి చివరి వారంలో ఆరంభం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.
Also Read: Son of India: ఆ ఇద్దరు హీరోలే ఇదంతా చేస్తున్నారు.. వారికి శిక్ష తప్పదు! మోహన్ బాబు వార్నింగ్!!
Also Read: IND Vs WI 3rd T20I: అభిమానులకు శుభవార్త.. మూడో టీ20కి ప్రేక్షకులకు అనుమతి! వారికి ఫ్రీ టికెట్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook