Hasin Jahan: 'ఇండియా' పేరు మార్చండి.. ప్రధాని మోదీకి స్టార్ క్రికెటర్ సతీమణి ప్రత్యేక అభ్యర్ధన!

Indian Bowler Mohammed Shami's wife Hasin Jahan makes special request to PM Modi. 'ఇండియా' పేరు మార్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని మొహ్మద్ షమీ సతీమణి హసీన్‌ జహాన్‌ కోరారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 15, 2022, 05:43 PM IST
  • నేడు స్వాతంత్య్ర దినోత్సవం
  • 'ఇండియా' పేరు మార్చండి
  • ప్రధానికి స్టార్ క్రికెటర్ సతీమణి ప్రత్యేక అభ్యర్ధన
Hasin Jahan: 'ఇండియా' పేరు మార్చండి.. ప్రధాని మోదీకి స్టార్ క్రికెటర్ సతీమణి ప్రత్యేక అభ్యర్ధన!

Mohammed Shamis wife Hasin Jahan wants to change the name of the country: హసీన్‌ జహాన్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మోడల్‌గా పాపులర్ అయిన హసీన్‌.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీని పెళ్లి చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. షమీతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న జహాన్‌.. నిత్యం వార్తల్లో ఉంటారు. వ్యక్తిగత జీవితం లేదా పలు ట్వీట్స్ కారణంగా ఎప్పుడూ వివాదాలలో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే హసీన్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' సంబురాలు జరిగాయి. ఈ  సమయంలో మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ ఓ ట్వీట్ చేశారు. 'ఇండియా' పేరు మార్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కోరారు. వాడుకలో ఉన్న 'ఇండియా' పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని..దేశం పేరును ‘భారత్’ లేదా ‘హిందుస్తాన్’ అని పెట్టాలని షమీ సతీమణి కోరారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

హసీన్‌ జహాన్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి... 'అందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై.  మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మన దేశం పేరు హిందుస్తాన్ లేదా  భారత్ అని ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నా విజ్ఞప్తి ఇదే. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇండియా పేరు మార్చి భారత్ లేదా హిందుస్తాన్ అని పెట్టండి. దాంతో మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది' అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Also Read: భారత దేశ ప్రజలకు పాకిస్తానీ కళాకారుడి అద్భుత గిఫ్ట్.. వీడియో వైరల్!

Also Read: త్రివర్ణ పతాకంలోని రంగులకు, ఆస్ట్రాలజీకి గల సంబంధం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News