IND vs SL Playing XI: గిల్, శ్రేయస్‌లకు చోటు.. తెలుగు ఆటగాడికి నిరాశే! శ్రీలంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!

IND Playing 11 vs SL 1st Test: అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంకు తెలుగు ఆటగాడు హనుమ విహారి, యువ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ పోటీపడుతున్నారు. లంకపై టీ20ల్లో పరుగుల వరద పారించిన శ్రేయస్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 04:18 PM IST
  • భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌
  • పుజారా-రహానే స్థానాల్లో బరిలోకి దిగే ఆటగాళ్లు వీరే
  • తెలుగు ఆటగాడికి నిరాశే
IND vs SL Playing XI: గిల్, శ్రేయస్‌లకు చోటు.. తెలుగు ఆటగాడికి నిరాశే! శ్రీలంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!

India Playing 11 vs Sri Lanka 1st Test: సొంతగడ్డపై శ్రీలంకను టీ20ల్లో చిత్తు చేసిన భారత్.. ఇక టెస్ట్‌ సమరానికి సిద్దమైంది. రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 4) భారత్‌, శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు టాస్ పడనుండగా.. మ్యాచ్ 9.30 గంటలకు ఆరంభం అవనుంది. అయితే గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌.. ఫామ్ లేమితో సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పుజారాలపై వేటు పడింది. దాంతో తొలి టెస్ట్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓసారి ప్లేయింగ్ ఎలెవన్‌ను పరిశీలిద్దాం. 

గాయం కారణంగా స్టార్ ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ దూరమవడంతో.. రోహిత్‌ శర్మతో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. గతంలో ఈ ఇద్దరు టీమిండియాకు మంచి ఆరంభాలు ఇచ్చిన విషయం తెలిసిందే. చేటేశ్వర్ పుజారాపై వేటు పడింది కాబట్టి కీలకమైన మూడో స్థానంలో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ ఆడనున్నాడు. భారత్-ఎ జట్టు తరఫున కూడా అతడికి మూడవ స్థానంలో ఆడిన అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం. నాలుగో స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు.

అజింక్య రహానే బ్యాటింగ్ చేసే ఐదో స్థానంకు తెలుగు ఆటగాడు హనుమ విహారి, యువ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ పోటీపడుతున్నారు. లంకపై టీ20ల్లో పరుగుల వరద పారించిన శ్రేయస్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆరో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఆపై రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్‌రౌండర్‌లుగా ఈ ఇద్దరు జట్టుకు సేవలు అందించనున్నారు. మ్యాచ్ పరిస్థిలుతులను బట్టి బ్యాటింగ్‌లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 

పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌ ఆడనున్నారు. ఒకవేళ సొంత గడ్డపై ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తే.. జయంత్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. ఇదే జరిగితే ముగ్గురు పేసర్లలో ఒక్కరిపై వేటు పడుతుంది. విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్ట్ మ్యాచ్ కాబట్టి లంకపై గెలిచెందుకే భారత్ ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్‌ శర్మ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌/హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌. 

Also Read: Ananya Panday Dating: నేను ఒంటరిగా లేను.. అసలు విషయం చెప్పేసిన అనన్య పాండే!!

Also Read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News