Hardik Pandya Got Emotional During National Anthem: విండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. తొలి టీ20 మ్యాచ్‌లో కరేబియన్ జట్టు చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 20 ఓవర్లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (48), నికోలస్ పూరన్ (41), బ్రాండన్ కింగ్ (28) రాణించారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. అరంగేట్ర బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చివరి వన్డేలో అదరగొట్టిన యువ ఆటగాళ్లు.. ఈ మ్యాచ్‌లో ముకుమ్మడిగా విఫలమయ్యారు.
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ అనంతరం రెండు జట్లు ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపించారు. మన జాతీయ గీతం ఆలపించే సమయంలో పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. కళ్లలో కన్నీళ్లు ఉబికివచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Hardik “ pAsSiOnAtE “ Pandya pic.twitter.com/hh3HZRDr66
— shank (@shanktweetss) August 3, 2023
వెస్టిండీస్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ టీమిండియాకు ప్రత్యేకమైనది. పొట్టి ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా నిలిచింది. పాకిస్థాన్, భారత్ జట్లు మాత్రమే 200 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. ఇంతకుముందు 50, 100, 150వ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. 200వ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టెస్ట్, వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్.. వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టు అయిన భారత్‌కు కళ్లెం వేసింది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
అదరగొట్టిన తిలక్ వర్మ
ఈ మ్యాచ్ ద్వారా మరో తెలుగు కుర్రాడు టీమిండియా తరుఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో అదగొడుతున్న తిలక్ వర్మ.. తన తొలి టీ20 మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు. తాను ఎదుర్కొన్న రెండు, మూడు బంతులనే సిక్సర్లుగా మలిచి.. అంతర్జాయతీయ పరుగుల వేటను ప్రారంభించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా తేలిపోయినా.. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరిపోయాడు. తిలక్ వర్మ కాసేపు క్రీజ్‌లో ఉంటే.. మ్యాచ్ టీమిండియానే గెలిచేదని అభిమానులు అంటున్నారు.
Also Read: Ind Vs WI 1st T20I Match Highlights: తొలి టీ20 విండీస్‌దే.. మ్యాచ్ గతిని మార్చేసిన ఆ ఒక్క ఓవర్..!
Also Read: CM KCR: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పీఆర్‌సీ, ఐఆర్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి