IND vs SL: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. హర్షల్ పటేల్ ఔట్! స్టార్ పేసర్ ఇన్

India have won the toss and opt to bowl in IND vs SL 2nd T20I. మరికాసేపట్లో పూణెలో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 5, 2023, 07:04 PM IST
  • శ్రీలంకతో రెండో టీ20
  • ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
  • హర్షల్ పటేల్ ఔట్
IND vs SL: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. హర్షల్ పటేల్ ఔట్! స్టార్ పేసర్ ఇన్

Rahul Tripathi, Arshdeep Singh in and Sanju Samson, Harshal Patel out for IND vs SL 2nd T20: టీ20 సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చాడు. అలానే పేసర్ హర్షల్ పటేల్ స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆడనున్నాడు. మరోవైపు లంక ఎలాంటి మార్పులు చేయలేదు.  

తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో టీ20లోకి కూడా గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకోవాలి భావిస్తోంది. తొలి టీ20లో విజయానికి చేరువగా వెళ్లి త్రుటిలో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఎలాగైనా రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్‌ రాహుల్‌ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 

తుది జట్లు:
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్. 
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్‌ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్‌ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక. 

Also Read: Python Girl Dinner Viral Video: డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కి వెళ్లిన కొండచిలువ.. పక్కన అమ్మాయి కూడా! మైండ్ బ్లాకింగ్ వీడియో

Also Read: Amla Hair Care Tips: ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు కావాలా.. వారానికి రెండుసార్లు ఇలా చేయండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News