BCCI says Virat Kohli will Play ODI Series vs South Africa: టెస్ట్, వన్డే సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకి భారత్ వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో క్వారంటైన్ అయిన టీమిండియా ప్లేయర్స్.. గురువారం దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నారు. డిసెంబర్ 26 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుండగా.. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తనను ముందస్తు సమాచారం లేకుండా తప్పించడంతో నిరాశకు గురైన విరాట్ కోహ్లీ (Virat Kohli).. పరిమిత ఓవర్ల సిరీస్ (ODI Series)కు దూరమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై బీసీసీఐ (BCCI) అధికారులు స్పందించారు.
ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ ()Rohit Sharma మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్‌ను ప్రశ్నించగా.. 'అలాంటిది ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటిని ఏమాత్రం నమ్మొద్దు. నాకు తెలిసి విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించకముందే దక్షిణాఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అందుబాటులో ఉండను అని బీసీసీఐతో చెప్పాడు' అని సమాధానం ఇచ్చారు.
Also Read: Deadline Dates and Works: డిసెంబర్ 31 లోగా తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి
దక్షిణాఫ్రికా పర్యటన ( South Africa Tourt)లో విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను మరో బీసీసీఐ (BCCI) అధికారి తోసిపుచ్చారు. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడా? అని అడగ్గా.. 'తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడు. ఇప్పటివరకైతే కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు మాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. దాంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్ వన్డే సిరీస్‌లో ఆడుతాడా? లేదా? అన్న అనుమానం నెలకొంది. ఏదేమైనా డిసెంబర్ 16న జోహన్నెస్‌బర్గ్‌కు భారత్ వెళ్లనుంది. కాబట్టి ఈరోజు టెస్ట్ కెప్టెన్ అయిన విరాట్ మీడియా సమావేశంలో పాల్గొననున్నాడు. ఆ సమయంలో అసలు విషయం బయటపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook