IND vs SA: దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!

Top 5 Indian batters list against South Africa in T20I cricket. టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 28, 2022, 11:41 AM IST
  • భారత్ vs దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌
  • దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లు
  • టాప్‌లో రోహిత్ శర్మ
IND vs SA: దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!

IND vs SA 1st T20I, Top 5 Indian batters list against South Africa in T20I cricket: స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ 2022 ఆరంభానికి ముందు పటిష్ట దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించిన మాదిరిగానే.. ప్రొటిస్‌ను మట్టికరిపించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. బుధవారం (సెప్టెంబర్ 28) తిరువనంతపురంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ నేపథ్యంలో పొట్టి క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్ల జాబితాను ఓసారి చూద్దాం. 

రోహిత్ శర్మ:
టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై 13 మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 362 పరుగులు చేశాడు. దాంతో టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

సురేశ్ రైనా:
టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా భారత మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై రైనా 12 మ్యాచ్‌లు ఆడి 339 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ:
టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై ఆడిన 10 టీ20ల్లో కోహ్లీ 254 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కంటే విరాట్ 108 పరుగులు వెనకంజలో ఉన్నాడు. 

శిఖర్ ధావన్:
దక్షిణాఫ్రికాతో జరిగిన 10 టీ20 మ్యాచ్‌ల్లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 233 పరుగులు చేశాడు. దాంతో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. 

ఇషాన్ కిషన్:
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో జరిగిన 5 టీ20 మ్యాచ్‌ల్లో 206 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 

Also Read: విరాట్ కోహ్లీకి పోటీగా రోహిత్ శర్మ భారీ కటౌట్.. రోహిత్ డబ్బులు పంపించాడా?

Also Read: IND vs SA 1st T20I: తొలి టీ20కి భారీ ముప్పు.. మ్యాచ్ సజావుగా సాగడం కష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News