Ravichandran Ashwin: రేపటి నుంచే రెండో టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన అశ్విన్..

Ind vs Eng Second Test: రేపటి నుంచి వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మెుదలుకానుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకోబోతున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 08:20 PM IST
Ravichandran Ashwin: రేపటి నుంచే రెండో టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన అశ్విన్..

Ravichandran Ashwin latest news: విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగుతోంది. దీంతో రవిచంద్రన్ అశ్విన్ పై స్పిన్ భారమంతా పడింది. తాజాగా టెస్టుల్లో ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచిన అశ్విన్.. మరిన్ని రికార్డులపై కన్నేశాడు. 

ఇంగ్లండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత్ ఆటగాడిగా నిలవడానికి కేవలం మూడు వికెట్లు దూరంలో ఉన్నాడు అశ్విన్. 20 టెస్టులాడిన అశ్విన్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై 93 వికెట్లు తీశాడు. ఇతడి కంటే ముందు చంద్రశేఖర్ 23 టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో అశ్విన్ ఏడు వికెట్లు తీస్తే వంద వికెట్లు  తీసిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డులకెక్కనున్నాడు.  

ఇప్పటి వరకు 96 టెస్టు మ్యాచుల్లో 496 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీయడానికి అవసరమైన వికెట్లు నాలుగు. అశ్విన్ ఈ వికెట్లు తీస్తే ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా బౌలర్ గా, ఓవరాల్ గా తొమ్మిదో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. వైజాగ్ టెస్టులో అశ్విన్ ఈ ఫీట్ సాధిస్తే అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా రెండో ఫాస్టెస్ట్‌ బౌలర్ గా చరిత్రకెక్కనున్నాడు. 

Also read: Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..

భారత గడ్డపై కుంబ్లే రికార్డును బద్దలుకొట్టడానికి మరో ఎనిమిది వికెట్లు అవసరం. ఇప్పటి వరకు 56 టెస్టులాడిన అశ్విన్ 343 వికెట్లు తీయగా.. 350 వికెట్లతో కుంబ్లే తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆడిన 96 టెస్టు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లును 34 సార్లు తీశాడు. వైజాగ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు వికెట్లు తీయగలిగితే.. అతడు కుంబ్లే రికార్డును బ్రేక్ చేయగలుగుతాడు. 

Also Read: India vs England: వైజాగ్ టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ దూరం.. అతడి స్థానంలో కొత్త కుర్రాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News