ICC Gives Three demerit points to Indore pitch after rated poor: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యంను ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇండోర్ పిచ్‌పై బంతి తొలి రోజు నుంచే గింగిరాలు తిరగడంతో.. బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై 31 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు స్పిన్నర్లు తీయగా.. మిగతా ఐదు వికెట్లు పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి. దాంతో ఇండోర్ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పిచ్‌లతో 'టెస్ట్ క్రికెట్'ను అపహస్యం చేయడమేనని మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు.
మూడో టెస్ట్‌కు (IND vs AUS 3rd Test Indore Pitch) ఉపయోగించిన ఇండోర్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియస్ అయింది. భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్ అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం బీసీసీఐని మందలిస్తూ.. ఇండోర్ పిచ్‌కు మూడు డీమెరిట్ పాయింట్స్ విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండోర్ పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. ఇరుజట్ల కెప్టెన్ల అభిప్రాయాలను తీసుకొని ఐసీసీకి నివేదిక అందజేశాడు.
'ఇండోర్ పిచ్ చాలా పొడిగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి మధ్య ఎలాంటి సమన్వయం లేదు. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయి.. క్రమంగా బౌన్స్ వస్తుందని చెప్పారు. అది జరగలేదు. పేసర్లకు ఏమాత్రం అనుకూలించలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. పిచ్‌ను క్యురేటర్ మరీ నాసిరకంగా ప్రిపేర్ చేశాడు' అని క్రిస్ బ్రాడ్ తన నివేదికలో పేర్కొన్నాడు. ఈ నివేదికను పరిశీలించిన ఐసీసీ.. ఇండోర్ పిచ్‌కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది.
ఐసీసీ తన నివేదికను బీసీసీఐకి పంపింది. పిచ్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు అప్పీల్ చేసుకోవచ్చని కూడా ఐసీసీ పేర్కొంది. 'ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే.. స్టేడియంపై నిషేధం పడుతుంది. నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉంది' అని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.
Also Read: 20 వేల రియల్‌మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 649కే.. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు!
Aslo Read: Shani Uday 2023: మార్చి 6న కుంభ రాశిలో శని ఉదయం.. ఈ రాశుల వారి పని ఔట్! అజాగ్రత్తగా ఉంటే అంతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.