IND Vs AFG: కోహ్లీ లేకుండానే బరిలోకి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 నేడే...

 IND Vs AFG: భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య తొలి టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్ కు కోహ్లీ దూరమయ్యాడు. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 02:20 PM IST
IND Vs AFG: కోహ్లీ లేకుండానే బరిలోకి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 నేడే...

IND Vs AFG 1st T20I live: భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు తొలి టీ20 మ్యాచ్‌ కు రెడీ అయ్యాయి. గురువాం మొహాలీ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ ముందు జరగబోతున్న ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకమైనది. 14 నెలల తర్వాత జట్టులోకి తిరిగివచ్చిన రోహిత్, కోహ్లీలపైనే అందరి చూపు ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటిన హిట్ మ్యాన్ మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మెుదలుపెట్టనున్నాడు.  కోహ్లీ గైర్హాజరీతో శుభ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. 

మిడిలార్డర్‌లో తిలక్‌వర్మ, రింకూసింగ్‌, శాంసన్‌, జితేశ్‌శర్మ బరిలోకి దిగే అవకాశం ఉంది. కీపర్‌ విషయంలో శాంసన్‌, జితేశ్‌ మధ్య పోటీ నెలకొంది. తిలక్ కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఇందులో రాణిస్తేనే తిలక్‌కు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశముంది. అర్ష్‌దీప్‌షింగ్‌, అవేశ్‌ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ పేస్‌ బౌలర్లుగా కొనసాగనున్నారు. స్పిన్ విషయానికొస్తే.. కుల్దీప్‌యాదవ్‌, రవి బిష్ణోయ్‌ల్లో ఒకరికి తుది జట్టులో దక్కే అవకాశం ఉంది. మరోవైపు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ లేకుండానే అఫ్గానిస్థాన్‌ టీమ్ బరిలోకి దిగుతుంది. యువ క్రికెటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సారథిగా వ్యవహారించనున్నాడు. 

Also Read: Ruhani Sharma : సైంధవ్ మూవీలో హీరోయిన్‌గా విరాట్ కోహ్లీ మరదలు.. ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా..!

జట్ల అంచనా:
భారత్‌ స్క్వాడ్: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌, తిలక్‌వర్మ, జితేశ్‌/శాంసన్‌, రింకూసింగ్‌, అక్షర్‌, కుల్దీప్‌, అవేశ్‌ఖాన్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, ముకేశ్‌కుమార్‌
అఫ్గానిస్థాన్‌ స్క్వాడ్: హజ్రతుల్లా, గుర్బాజ్‌, జద్రాన్‌(కెప్టెన్‌), ఒమర్జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, నబీ, గులాబ్దీన్‌ నయిబ్‌/కరీమ్‌ జనత్‌, ముజీబుర్‌ రెహమాన్‌, ఖాయిస్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫారుఖీ.

Also Read: Dinesh Karthik: ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా దినేశ్ కార్తీక్.. తొలి స‌వాల్ మనతోనే...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News