AP Elections Result 2024: చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో హ్యాట్రిక్.. ఆయన విజయ ప్రస్థానం ఇదే..!

AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..
 

1 /6

చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్‌ 20న నారవారి పల్లి, తిరుపతిలో జన్మించారు. ఆయన తల్లిపేరు అమనమ్మ, తండ్రి ఖర్జూర నాయుడు. చంద్రబాబునాయుడు చంద్రగిరి ప్రభుత్వ స్కూలు పదవ తరగతి పూర్తి చేశారు. ఆ సమయంలో బాబు ప్రతిరోజూ 11 కి.మి నడిచి స్కూలుకు వెళ్లేవారట. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తిచేశారు.  

2 /6

ఆ తర్వాత ఆయన అతి చిన్న వయస్సులోనే అంటే 28 ఏళ్లకే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు 1995-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి సీఎంగా పనిచేశారు.   

3 /6

మొదట్లో ఆయన 1970లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అతని మామగారు అయిన ఎన్‌టీరామరావు స్థాపించిన టీడీపీలో చేరారు. 1989 -1995 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.1992లోనే చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ ఫుడ్స్‌ స్థాపించారు.   

4 /6

ఈ సమయంలోనే చంద్రబాబుకు ప్రజల్లో గ్రాఫ్ పెరిగింది. హైదరాబాద్‌ ఆధునికీకరణకు కృషి చేశారు. అంతేకాదు హైటెక్‌ సిటీ స్థాపనకు కూడా కృషిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు కూడా తీసుకువచ్చారు.చంద్రబాబు నాయుడు 1995-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి సీఎంగా పనిచేశారు.  

5 /6

అయితే, 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కలిసి ఆయన్ను ఓడించారు.2004- 2014 వరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు. అయితే, విభజన జరిగిన తర్వాత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2014-2019 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కియా మోటర్స్‌ వంటి పెట్టుబడులను విదేశాల నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు.   

6 /6

కానీ, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ గట్టి పోటీని ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమి పాలయ్యింది. 175 స్థానాలకు కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్‌ ఫిగర్‌ దాటిన తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు అత్యధిక సమయంపాటు ఏపీకి సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఇప్పటికే ఉంది.