ఒకే ఒక్క మ్యాచ్...ఎన్నో రికార్డులు బద్దలు !!

భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఓ రికార్డు..మరి అలాంటి మ్యాచ్ లో ఎన్నో రికార్డులు బద్దలవ్వడం మరో అతి పెద్ద రికార్డు

Last Updated : Jun 17, 2019, 12:03 PM IST
ఒకే ఒక్క మ్యాచ్...ఎన్నో రికార్డులు బద్దలు !!

మన చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. 89 పరుగుల తేడాతో పాక్‌ను కోహ్లీసేన చిత్తు చేసింది. ఇదొక్కటే ఈ మ్యాచ్ లో విశేషం అనకుంటే పొరపాటే. ఒక్క మ్యాచ్ లో బొలెడు టీం, వ్యక్తిగత రికార్డు బద్దలయ్యాయి. భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా నమోదైన రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం..

* ప్రపంచకప్‌లో పాక్‌పై పరుగుల పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం
*  టీమిండియా కు ఇది పాక్ పై వరసగా ఏడో విజయం
*  విరాట్ కోహ్లీ తర్వాత వరల్డ్ కప్ లో పాక్‌పై సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌.
* వన్డేల్లో రోహిత్‌కిదే తొలి వేగవంతమైన (34 బంతుల్లో) హాఫ్‌ సెంచరీ 
 * భారత్‌-పాక్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌ (140) రోహితే
* ప్రపంచక్‌పలో తమ తొలి బంతికే వికెట్‌ తీసిన మూడో బౌలర్‌ విజయ్‌ శంకర్‌. 
* ప్రపంచకప్‌లో తొలిసారిగా పాక్‌పై తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించిన రోహిత్‌-రాహుల్‌ జోడీ.
*  ప్రపంచకప్‌లో సైమండ్స్‌ (143 నాటౌట్‌) తర్వాత పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ (140)
* వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ (203)లో 24 సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌ రోహిత్‌.
*  ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఈమెగా టోర్నీలో ఇతనికిది మూడో శతకం. 
* టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డు

 

Trending News