Video: ఇలాంటి కామెడీ రనౌట్ చూసి ఎన్నీ రోజులైందో...! వీడియో చూడండి!

పాకిస్తాన్ ( Pakistan ) జింబాబ్వే ( Zimbabwe) మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. రావల్పిండీ క్రికెట్ స్టేడియం ( Rawalpindi Cricket Stadium ) లో ఈ రెండు టీమ్స్ మధ్య తొలి వన్డే మ్యాచు గురువారం జరిగింది.

Last Updated : Oct 30, 2020, 11:06 PM IST
    • ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
    • బ్యాటింగ్ సమయంలో పాకిస్తాన్ టీమ్ లోని ఇద్దరు బ్యాట్స్ మెన్ రన్ ఔట్ అయిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
    • వీరి తీరు మారదు అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.
Video: ఇలాంటి కామెడీ రనౌట్  చూసి ఎన్నీ రోజులైందో...! వీడియో చూడండి!

పాకిస్తాన్, జింబాబ్వే ( Zimbabwe ) మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. రావల్పిండీ క్రికెట్ స్టేడియం ( Rawalpindi Cricket Stadium ) లో ఈ రెండు టీమ్స్ మధ్య తొలి వన్డే మ్యాచు గురువారం జరిగింది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ సమయంలో పాకిస్తాన్ టీమ్ లోని ఇద్దరు బ్యాట్స్ మెన్ రన్ ఔట్ అయిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీరి తీరు మారదు అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.

Also Read  |  ANGRAU Admissions 2020: ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్

పాకిస్తాన్ ( Pakistan ) టీమ్ ప్లేయర్ హేరిస్ సోహైల్, ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ కామెడీ రనౌట్ జరిగింది. ఇమామ్ ఉల్ హక్ స్ట్రైక్ పై ఉన్నారు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో హేరిస్ సోహైల్ ఉన్నారు.  జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా బౌల్ వేయగానే ఇమామ్ ఉల్ హక్ షాట్ కొట్టి రన్ తీయడానికి ముందుకు కదిలాడు. కానీ వెంటనే తిరిగి వెనక్కి తన క్రీజ్ లోకి వచ్చేశాడు. అంతే కానీ తన తోటి బ్యాట్స్ మెన్ గురించి పట్టించుకోలేదు. ఎలాంటి వార్నింగ్ కూడా ఇవ్వకుండా వెనక్కి తగ్గాడు. 

Also Read | Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ?

అదే సమయంలో సోహైల్ కూడా ఇవన్నీ చూడకుండా ముందుకు పరుగెత్తి క్రీజులోకి చేరిపోయాడు. అటే ఇద్దరు ఆటగాళ్లు ఒకే క్రీజులోకి చేరిపోయారు. దాంతో బౌలింగ్ ఎండ్ వద్ద ఉన్న ఫీల్డర్ బాల్ తీసుకుని బేల్స్ ఎగరగొట్టారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎంత పెద్ద కమ్యూనికేష్ గ్యాప్ ఉందో చూసి ప్రపంచం మొత్వం నవ్వుతోంది. సోషల్ మీడియాలో అయితే వీరిపై భారీ ట్రోలింగ్ నడుస్తోంది. 

ట్విట్టర్ పై పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఎంపికను, ట్రైనింగ్ విషయంలో నెటిజెన్లు ( Netizens ) ట్రోల్ చేస్తున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News