IND vs PAK T20 World Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

IND vs PAK T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ విక్రయానికి ఉంచగా.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 01:11 PM IST
    • టీ20 ప్రపంచకప్ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న ఐసీసీ
    • ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు మంచి గిరాకీ
    • నిమిషాల వ్యవధిలో పూర్తైన టికెట్లు అమ్మకం!
IND vs PAK T20 World Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

IND vs PAK T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం మరోసారి రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కూడా విదేశీయులను అనుమతించడం వల్ల టీ20 ప్రపంచప్ కు సంబంధించి టికెట్లను అంతర్జాతీయ క్రికెట్ కమిటీ విక్రయానికి ఉంచింది. 

అయితే టీ20 ప్రపంచకప్ వేదికగా మరోసారి దాయాదులైన ఇండియా, పాకిస్థాన్ పోరును చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిచూపారు. ఈ మ్యాచుకు సంబంధించిన టికెట్లు కేవలం కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో టీమ్ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022లో అక్టోబరు 23న ఇరుజట్లు తలపడనున్నాయి. 

టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చే వారికి టికెట్ ధరలను ఐసీసీ నిర్ణయించింది. పిల్లలకు (5 డాలర్లు) రూ.374, పెద్దలకు (20 డాలర్లు) రూ.1495గా నిర్ణయిస్తూ ఇటీవలే ప్రకటన చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు https://www.t20worldcup.com/ వైబ్​సైట్​లో సోమవారం (ఫిబ్రవరి 7) నుంచి అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది 16 నుంచి నవంబరు 13 వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్ కు అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ వేదికలు కానున్నాయి. 

Also Read: T20 World Cup 2022: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. అమ్మకానికి టీ20 వరల్డ్ కప్ టికెట్లు..

Also Read: IPL 2022 Auction: ఆ క్రికెటర్ కోసం పోటీపడుతున్న మూడు జట్లు.. కెప్టెన్సీ ఇవ్వడానికైనా రెడీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News