ICC T20I Teams 2022: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు.. భారత్‌ నుంచి ఏడుగురు ఎంపిక! రోహిత్ శర్మ మాత్రం లేడు

ICC Announces Mens T20I Team Of The Year 2022, 3 Indian Players Selected. 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టీ20 జట్లని ఐసీసీ నేడు ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 23, 2023, 08:15 PM IST
  • ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు
  • భారత్‌ నుంచి ఏడుగురు ఎంపిక
  • రోహిత్ శర్మ మాత్రం లేడు
ICC T20I Teams 2022: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు.. భారత్‌ నుంచి ఏడుగురు ఎంపిక! రోహిత్ శర్మ మాత్రం లేడు

ICC Announces Mens and Womens T20I Team Of The Year 2022: 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టీ20 జట్లని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నేడు ప్రకటించింది. పురుషుల అత్యుత్తమ టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లలో మొత్తంగా ఏడుగురు భారత ప్లేయర్స్‌కు చోటు దక్కింది. పురుషుల జట్టులో స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోగా.. మహిళల టీంలో స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ చోటు దక్కించుకున్నారు. 

2022లో టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని. 11 మంది ఆటగాళ్లతో ఐసీసీ రెండు జట్టుని ప్రకటించింది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో ప్రదర్శన ఆధారంగా పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసినట్టు ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. జోస్‌ బట్లర్‌ పురుషుల జట్టుకు, మహిళల టీంకు సోఫీ డివైన్ సారథులుగా ఎంపికయ్యారు. రెండు జట్లపై భారత్ ప్లేయర్స్ ఆధిపత్యం చెలాయించారు. భారత్ పురుషుల జట్టు గత సంవత్సరం మొత్తం 40 టీ20I గేమ్‌లు ఆడింది. ఆసియా కప్ 2022, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ పర్వాలేదనిపించింది.

పురుషుల టీ20 జట్టు:
జోస్‌ బట్లర్‌ (కెప్టెన్, ఇంగ్లండ్), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (భారత్‌), సూర్యకుమార్‌ యాదవ్ (భారత్‌)‌, గ్లెన్ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌), సికిందర్‌ రజా (జింబాబ్వే), హార్దిక్‌ పాండ్యా (భారత్), సామ్ కరన్ (ఇంగ్లండ్)‌, వానిందు హసరంగ (శ్రీలంక), హారిస్ రవూఫ్‌ (పాకిస్థాన్‌), జోష్‌ లిటిల్ (ఐర్లాండ్)‌. 

మహిళల టీ20 జట్టు:
సోఫీ డివైన్ (కెప్టెన్‌, న్యూజిలాండ్), స్మృతి మంధాన (భారత్‌), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా), తహిలా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్థాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (భారత్‌), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇనోకా రణవీర (శ్రీలంక).

Also Read: Yamaha RX100 Launch: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ లాంచ్ అవుతోంది! 150cc ఇంజిన్  

Also Read: Cheapest New Honda Activa 2023: ఖరీదైన కార్ల ఫీచర్లతో.. సరికొత్త చౌకైన హోండా యాక్టివా లాంచ్!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News