ICC Men's T20 Team Of The Year 2022: 2022 సంవత్సరానికి బెస్ట్ టీ20 అంతర్జాతీయ జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ జట్టులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. గతేడాదిలో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేసింది ఐసీసీ. ముగ్గురు భారత ఆటగాళ్లతోపాటు, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు, ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున చోటు దక్కించుకున్నారు.
ఓపెనర్లుగా జోస్ బట్లర్‌కు తోడు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. పాక్ సారథి బాబర్ ఆజామ్‌కు చోటు దక్కలేదు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మూడోస్థానానికి, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానానికి ఎంపికయ్యారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’లో ఎంపికయ్యాడు. జింబాబ్వే తరుఫున అదరగొట్టిన సికిందర్ రజా, ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఐసీసీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.
The ICC Men's T20I Team of the Year 2022 is here 👀
Is your favourite player in the XI? #ICCAwards
— ICC (@ICC) January 23, 2023
టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన సామ్ కర్రన్, కివీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్, శ్రీలంక ఆల్‌రౌంటర్ వనిందు హసరంగా, పాకిస్థాన ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌లు ఐసీసీ జట్టుకు ఎంపిక అయ్యారు. అయితే ఆసీసీ, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, వెస్టిండీస్ జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించులేకపోయారు.
సూర్యకుమార్ గతేడాది అద్భుతమైన ఫామ్‌తో అదరగొట్టాడు. 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేసి టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది సెంచరీ కరువు తీర్చుకున్న కోహ్లీ.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు.
టీ20 ప్రపంచ కప్‌లో మెల్‌బోర్న్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీలో మరో మూడు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.
గతేడాది టీ20ల్లో హార్దిక్ పాండ్యా కూడా సూపర్ పర్ఫామెన్స్ చేశాడు. బ్యాటింగ్‌లో 607 పరుగులు చేయడంతోపాటు.. బౌలింగ్‌లో 20 వికెట్లు కూడా తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో 33 బంతుల్లో 63 పరుగులు చేసి.. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఐసీసీ ఉత్తమ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, సామ్ కర్రాన్, వనిందు హసరంగా, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్.
Also Read: UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. పోలీసులపై రాళ్లు విసిరిన స్థానికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook