England Vs New Zealand Predicted Playing 11: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ 2023 మరి కాసేపట్లో మొదలుకానుంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. వరల్డ్ కప్ వేటను ప్రారంభించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. గత ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ ప్రపంచ కప్‌కు ఒక నెల ముందు వన్డే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని.. తిరిగి జట్టులోకి వచ్చాడు.
అయితే కివీస్‌తో జరితే తొలి మ్యాచ్‌కు స్టోక్స్ దూరమయ్యాడు. హిప్ నిగల్‌తో స్టోక్స్ బాధపడుతున్నాడని ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ వెల్లడించాడు. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకుని స్టోక్స్‌ను ఆడించలేమని.. తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. స్టోక్స్ స్థానంలో యువ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. చివరి నిమిషంలో వెటరన్ ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో బ్రూక్ ఇంగ్లాండ్ ప్రపంచ కప్ జట్టులో ఎంపికైన విషయం తెలిసిందే.
అటు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్, స్టార్ బౌలర్ టిమ్ సౌథీ తొలి మ్యాచ్‌లో ఆడడం లేదు. వీరిద్దరు గాయాల నుంచి కోలుకున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో సెట్ అవ్వలేదు. ఐపీఎల్‌లో గాయపడిన విలియ్సన్.. కోలుకుని నేరుగా వరల్డ్ కప్‌కు వచ్చాడు. వార్మప్ మ్యాచ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసినా.. ఫీల్డింగ్‌కు రాలేదు. సౌథీ వేలికి శస్త్రచికిత్స చేయించుకుని జట్టుతో ఆలస్యంగా చేరాడు. వార్మాప్ మ్యాచ్‌లలో కూడా ఆడలేదు. విలియమ్సన్, సౌథీ స్థానాల్లో ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, పేసర్ మాట్ హెన్రీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ
న్యూజిలాండ్: విల్ యంగ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు
Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook