Sunil Gavaskar question ICC after IND vs AUS 3rd Test Indore Pitch gets poor rating: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ ఇండోర్‌లో జరిగిన విషయం తెలిసిందే. స్పిన్‌కు సహకరించి బ్యాటింగ్ కష్టంగా మారిన ఇండోర్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియస్ అయింది. మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్ అత్యంత చెత్తదని వేదిక ఆధారంగా ఐసీసీ పేర్కొంది. అంతేకాదు ఇండోర్ మైదానానికి మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాలోని గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు అని ఐసీసీని ప్రశ్నించారు.
'ఇప్పుడు నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. 2022 నవంబర్‌లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. గబ్బా పిచ్‌కు ఐసీసీ ఎన్ని డీమెరిట్ పాయింట్లు కేటాయించింది?. అప్పుడు మ్యాచ్ రెఫరీ ఎవరు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ముగిసింది. అయినా డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు. మరి గబ్బాకు ఎందుకు డీమెరిట్ పాయింట్లు ఇవ్వలేదో' అని సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు.
గతేడాది గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన ఈ పిచ్‌కు సంబంధించి ఐసీసీ ఒకే ఒక్క డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. యావరేజ్ కంటే తక్కువ అని రేటింగ్ ఇచ్చి వదిలేసింది. ఇండోర్‌లో జరిగిన టెస్టు మూడో రోజుకు చేరింది. ఇదే విషయాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ లేవనెత్తి ఐసీసీపై మండిపడ్డాడు.
భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్ (Indore Pitch Controversy) అత్యంత చెత్తదని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారని, నిబంధనల ప్రకారం మూడు డీమెరిట్ పాయింట్స్ విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఈ నివేదికను బీసీసీఐకి పంపింది. పిచ్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. 14 రోజుల లోపు అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది.
Aslo Read: Python Vial Video: ఏలూరు జిల్లాలో కొండచిలువల హల్‌చల్.. ఐదింటిని హతమార్చిన గ్రామస్తులు! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Indore Pitch Controversy: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు.. ఐసీసీపై ఫైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజం!
గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు
ఐసీసీపై ఫైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజం
ఒకే ఒక్క డీమెరిట్ పాయింట్ ఇచ్చింది