హాకీ ఆసియా కప్ 2017లో రెండు విజయాల తర్వాత, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఖంగు తినిపించింది. 3-1 పాయింట్లతో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో ఓడినా పాకిస్తాన్ సూపర్ 4 కి అర్హత సాధించింది. చింగల్సనా సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ మరియు రమణ్‌దీప్ సింగ్ భారత్ తరఫున గోల్స్ సాధించి విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.
భారత్ - పాక్ జట్టులు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన 170వ మ్యాచ్ ఇది. అందులో 82 మ్యాచ్‌లు పాకిస్తాన్ గెలవగా, 53 మ్యాచ్‌లు భారత్ గెలవడం గమనార్హం. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ 13 గోల్స్ సాధించి ఇప్పటికే సూపర్ 4లోకి అడుగుపెట్టింది. మొదటి నుండీ దూకుడుగానే ఆడిన భారత క్రీడాకారులు చివరి వరకే అలాగే ఆడారు.