Harbhajan Singh Comments On Teamindia Top 11: టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు ఓటమి పాకిస్థాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో పాక్ అభిమానులు టీమిండియా ఓటమిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్ కావాలనే ఓడిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలతోనే మ్యాచ్‌ను కోల్పోయింది.
టీమిండియా ఓటమిపై భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. తుది జట్టు ఎంపికను తప్పుబట్టాడు. ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను వెంటనే తొలగించాలని సూచించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లను బెంచ్‌కే పరిమితం చేయాలని చెప్పాడు.
'టీమిండియా మేనేజ్‌మెంట్ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆటగాళ్ల కంటే జట్టు ఎదగడం గురించి ఆలోచించాలి. కేఎల్ రాహుల్ గొప్ప బ్యాట్స్‌మెన్ కావచ్చు. కానీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌కు బదులుగా రిషబ్ పంత్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయాలి' అని హర్భజన్ సింగ్ అన్నాడు.
అంతేకాకుండా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టీమిండియాకు మైనస్‌గా మారాడని అన్నాడు భజ్జీ. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోతున్నాడని.. టాప్-11 నుంచి రెస్ట్ ఇవ్వాలన్నాడు.
'రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టు నుంచి తప్పించాలి. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇవ్వాలి. అతను మంచి వికెట్ టేకర్. చాహల్ ఒక మ్యాచ్ విన్నర్ బౌలర్. ప్రస్తుతం టీ20ల్లో అతని కంటే మెరుగైన లెగ్ స్పిన్నర్ లేడు..' అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో టీమిండియా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు గెలిస్తే.. నేరుగా సెమీస్‌కు చేరుతుంది. ఒకటి గెలిస్తే.. ఇతర జట్ల సమీకరణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. సఫారీ మ్యాచ్‌తో వెన్నునొప్పి కారణంగా మధ్యలో వెళ్లి పోయిన దినేష్ కార్తీక్ స్థానంలో తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. ఇక అశ్విన్ ప్లేస్‌లో చాహల్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
Also Read: Mark Adair: ఒకే ఓవర్‌లో 11 బంతులు.. టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook