Sourav Ganguly likely to contesting CAB President post: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న గంగూలీ.. తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. క్యాబ్ పీఠమెక్కేందుకు దాదా ఆసక్తి చూపిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదివరకు 2015 నుంచి 2019 వరకు దాదా క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశారు.
'నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నా. ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా. లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. ఈ నెల 20న ప్యానెల్‌ను ఖరారు చేస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం' అని ఓ జాతీయ మీడియాతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పారు. ఇదివరకు దాదా సోదరుడు స్నేహాశీష్ గంగూలీ కూడా క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించారు.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నికవడం దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల అనంతరం ఈ విషయం బయటికి వచ్చింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18న జరగనున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్ శుక్లా రేసులో ఉండగా.. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా అదే స్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Balakrishna - Rashmika : బాలయ్యను పడగొట్టేసిన రష్మిక మందన
Also Read: Munugodu Bypoll: మునుగోడు టు ఏపీ బీజేపీ, కొత్త పొత్తు టీడీపీకు వర్కవుట్ అవుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook