England vs India, 1st T20: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా గురువారం (జూలై 7) జరిగిన తొలి మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. 148 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో చెలరేగిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ఆది మ్యాచ్‌గా నిలిచాడు.
సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 6 ఫోర్లు, 1 సిక్సుతో 51 (33) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. సూర్య కుమార్ యాదవ్ 2 సిక్సులు, 4 ఫోర్లతో కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. దీపక్ హుడా 33 (17) పరుగులతో రాణించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 24 (14) పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
టీమిండియా నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ పూర్తిగా తడబడింది. తొలి ఓవర్‌లోనే టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో బట్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మొయిన్ అలీ (36), హ్యారీ బుక్ (28), క్రిస్ జోర్డాన్ (26) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో 19.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 148 పరుగులకే కుప్పకూలింది. 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs.
Take a 1-0 lead in the series.
Scorecard - https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ
— BCCI (@BCCI) July 7, 2022
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook