ICC Dock 2 WTC Points and Imposes 40 Per Cent Fine for India: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో ఓడిపోయిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లను కోతగా విధించింది. ఐసీసీ తాజా చర్యతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లండ్ సిరీస్‌లోని తొలి టెస్టులో, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కూడా టీమిండియా స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దాంతో మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లను భారత జట్టు కోల్పోయింది. ఐసీసీ నిబంధన ప్రకారం.. ఏదైనా జట్టు నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే అన్ని పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడుతుంది.
ఈ మ్యాచ్ ముందు వరకు మూడో స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 52.08 విజయాల శాతంతో 75 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 84 పాయింట్లు 77.78 విజయాల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (60; 71.43 శాతం), పాకిస్థాన్ (44; 52.38 శాతం) 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ (డబ్ల్యూటీసీ ఫైనల్) మ్యాచ్ ఆడుతాయి. ప్రస్తుతం భారత్ ఫైనల్ చేరడం కష్టంగానే ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ ఆడనున్న 6 మ్యాచ్‌లలో అన్ని గెలవాల్సి ఉంది.
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ..!
Also Read: ENG vs IND 5th Test: చెత్త బౌలింగ్.. టీమిండియా బౌలర్లపై సెహ్వాగ్ ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook