దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ( DC vs RR match ) మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసినవాళ్లకు ఎవరికైనా ఈ విజయం వెనుక ఢిల్లీ బౌలర్లు ( Delhi Capitals bowlers ) కీలక పాత్ర పోషించారనే విషయం అర్థమవుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. Also read : Shreyas Iyer injury update: ఢిల్లీ క్యాపిటల్స్‌కి దెబ్బ మీద దెబ్బ
రాజస్థాన్ రాయల్స్ ఛేదించాల్సిన స్కోర్ చిన్నదే అయినప్పటికీ.. ఢిల్లీ బౌలర్ల ముందు స్మిత్ సేన ఆటలు సాగలేదు. ఢిల్లీ బౌలర్ల పేస్ బౌలింగ్ ఎదుర్కోలేకపోయిన రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేసింది. దీంతో విజయం ఢిల్లీ సొంతమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా ఢిల్లీ జట్టు విజయం గురించి శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) మాట్లాడుతూ.. తమ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు అని చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ బౌలర్ల ( DC bowlers against RR ) గురించి గొప్పగా చెప్పిన వారిలో శిఖర్ ధావన్ ఒక్కడే కాదు.. ప్రత్యర్థి జట్టు కెప్టేన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ( Rajasthan Royals defeat ) దారితీసిన పరిణామాల గురించి స్మిత్ మాట్లాడుతూ.. '' ఢిల్లీ బౌలర్ల పేస్ బౌలింగ్ చక్కగా ఉందని.. ఢిల్లీ బౌలర్లు వేసే బంతులను ఎదుర్కోవడంలో మేము విఫలమయ్యాం'' అని అంగీకరించాడు. Also read : DC vs RR match, IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించిన ఢిల్లీ
''ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమితం చేయగలిగాం. కానీ ఛేజింగ్‌లో మాత్రం ఓపెనర్స్ సాధించిన పార్ట్‌నర్‌షిప్‌ని అలాగే ముందుకు తీసుకెళ్లలేకపోయాం. బ్యాట్స్‌మెన్ వచ్చిన వాళ్లే వచ్చినట్టే తిరిగి పెవిలియన్ బాటపట్టారు. ఢిల్లీ బౌలర్స్ పేస్ బౌలింగ్‌ని ఫేస్ చేయలేకపోవడమే అందుకు కారణం'' అని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు.
ప్రత్యర్థి బౌలర్లు వేసిన బంతుల ధాటికి తట్టుకుని నిలబడ లేకపోయాం అని ఏకంగా ఒక జట్టు కెప్టేన్ అంగీకరించాడంటే.. ఆ ప్రత్యర్థి జట్టుకు అంతకు మించిన విజయం ఇంకేం ఉంటుంది చెప్పండి.!! Also read : Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్